Mamta banerjee declines to transfer as ec ordered

Mamta Banerjee declines to transfer as EC ordered, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Mamta Banerjee declines to transfer as EC ordered

ఎన్నికల కమిషన్ వ్యతిరేక పార్టీల ఏజెంట్- మమతా

Posted: 04/08/2014 12:01 PM IST
Mamta banerjee declines to transfer as ec ordered

పశ్చిమ బెంగాల్ లో బదిలీ చెయ్యమని ఎన్నికల కమిషన్ చెప్పిన పోలీస్ అధికారుల బదిలీలకు మమతా బెనర్జీ అంగీకరించటం లేదు.  ఒక్కళ్ళు కూడా బదిలీ అవరు అని మమతా బెనర్జీ స్పష్టంగా చెప్పారు. 

కొందరు పోలీస్ అధికారులు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కి మద్దతుగా పనిచేస్తున్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఎన్నికల ప్రధాన కమిషనర్ పశ్చిమ బెంగాల్ కి వెళ్ళి విచారణ చేసారు.  ఆ తెల్లవారే ఇసి ఐదుగురు పోలీస్ సూపరింటెండెంట్లు, ఒక జిల్లా మేజిస్టేట్, ఇద్దరు అదనపు మేజిస్ట్రేట్ ల ట్రాన్స్ ఫర్ లకు ఆదేశాలిచ్చారు. 

దానితో ఆగ్రహం చెందిన మమతా బెనర్జీ అందుకు అంగీకరించకపోవటమే కాకుండా, ఇసి తన వైరి పార్టీల ఏజెంటని కూడా వ్యాఖ్యానించారు.  ఇసిని ఏమైనా చేసుకోమనండి నాకేం పరవాలేదు కానీ నేను మాత్రం ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఒక్కరిని కూడా ట్రాన్స్ ఫర్ చెయ్యనివ్వను అన్నారు మమతా.  నా రాజీనామా తీసుకోండి కావాలంటే కానీ వాళ్ళ బదిలీలను మాత్రం అంగీకరించనని మమతా స్పష్టం చేసారు. 

అయితే మమతా బెనర్జీ మంకు పట్టు వలన ఇసి పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి మీద చర్యలు తీసుకోవచ్చని, ఎన్నికలను కూడా అక్కడ నిలిపివేయవచ్చని ఆంతరంగిక సమాచారం. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles