Small robot that can do surgeries inside a physical body

Small robot that can do surgeries inside a physical body, Tiny robot to perform surgeries inside physical body, Tiny robot to cure gastric ulcers etc, Robot surgery suitable for astronauts

Small robot that can do surgeries inside a physical body

శరీరం లోపలికెళ్ళి శస్త్ర చికిత్స చేసే రోబాట్

Posted: 04/07/2014 04:43 PM IST
Small robot that can do surgeries inside a physical body

బయటి నుంచి పెద్ద చీరికతో శస్త్ర చికిత్స చేసే బదులు శరీరం లోపలే ఉండి లోపల్లోపలే వైద్యం చేస్తే ఎలా ఉంటుంది.  నిజానికి మన శరీరంలోపలే శరీరాన్ని బాగు చేసే వ్యవస్ధ ఉంది.  అది మన ఆహారపు అలవాట్లు, పరిశ్రమ, వ్యాయామాలతో శరీరాన్ని సజావుగా పనిచేసేట్టుగా చేస్తుంది.  కానీ అలాంటివేమీ చెయ్యనప్పుడు కానీ, లేదా ఏదైనా ప్రమాదం వలన కానీ శరీరం పనితనంలో లోపం సంభవించి శస్త్ర చికిత్స తప్పనిసరిగా చెయ్యవలసి వచ్చిన సందర్భంలో వైద్యులు ఆ పని చేసి రోగిని బ్రతికిస్తారు. 

అదే శస్త్ర చికిత్సను రోబో ద్వారా చేయించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.  సూక్ష్మమైన రోబోని పొట్ట లోపలికి బటన్ ఇన్సిషన్ ద్వారా ప్రవేశపెట్టి దానిచేత పని చేయించటానికి మోనిటర్ ని ఫుట్ పెడల్ ని ఉపయోగించే విధానాన్ని కనుగొన్నారు వైద్య శాస్త్రవేత్తలు.  అయితే  ఆ రోబో లోపల అటు ఇటూ తిరుగుతూ పని చెయ్యటానికి కావలసిన జాగా ఎక్కడినుంచి వస్తుంది.  ఇనర్ట్ గ్యాస్ ని వదిలి లోపల జాగా తయారు చేసుకుంటుంది ఆ రోబో. 

దీని ద్వారా గాస్ట్రిక్ అల్సర్స్ లేదా లోపలి గాయాలకు చికిత్స చెయ్యగలుగుతామని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  చికిత్సను లోపల చేసేది రోబోయే కాని, దాన్ని బయట నుంచి నియంత్రించేది మాత్రం మానవులే- వైద్య నిపుణులే.  పని అయిపోగానే ఆ సూక్ష్మ రోబోట్ తిరిగి బయటకు వచ్చేస్తుంది. 

ఈ వైద్య విధానం ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉండి పనిచేసే వ్యోమగాములకు చికిత్స చెయ్యటానికి బాగా పనికివస్తుంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles