Kejriwal slaped in delhi road show

Kejriwal slaped in Delhi road show, Arvind Kejriwal, Aam Admi Party road show, Kejriwal attacked in road show, Kejriwal attacked in Delhi

Kejriwal slaped in Delhi road show

ఢిల్లీలో కేజ్రీవాల్ ని చాచి కొట్టిన ఘటన

Posted: 04/04/2014 03:27 PM IST
Kejriwal slaped in delhi road show

ఢిల్లీ శాసన సభ ఎన్నికలలో అనూహ్యమైన విజయాన్ని సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ సంస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ లోక్ సభ ఎన్నికల సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తిచేత చెంపదెబ్బ తిన్నారు. 

ఢిల్లీ లో దక్షిణపురి ప్రాంతంలో రోడ్ షో చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ వాహనం మీదకు ఎక్కి గుర్తు తెలియని వ్యక్తి ఆయనమీద చెయి చేసుకున్నాడు.  పోలీసులు అతన్ని పట్టుకుని తీసికెళ్ళారు కానీ ఈ లోపులో అతగాడికి ఆఆపా మద్దతుదార్లు మంచి దేహశుద్ధే చేసారు. 

ఈ ఘటన తర్వాత, వాళ్ళని ఎంతైనా దాడి చెయ్యనివ్వండి ఏం పరవాలేదు.  కొందరంతే ప్రధానమంత్రి అవటానికి ఎంతకైనా తెగిస్తారు అన్నారు కేజ్రీవాల్. 

కేజ్రీవాల్ మీద దాడి ఇది మొదటిసారి కాదు.  హర్యానాలో, గుజరాత్ లో మహారాష్ట్రలో, ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లోకూడా వివిధరకాలుగా దాడులు జరిగాయి.  కారుని ధ్వంసం చెయ్యటం, మీద సిరా చల్లటం, కోడిగుడ్లు విసరటం, ఇప్పుడు ఏకంగా చెంప మీద కొట్టటం వరకు వెళ్ళింది. 

ఈ ఘటన మీద ఇతర రాజకీయ పార్టీలను విమర్శించటానికి, మొక్కవోని తన సాహసాన్ని ప్రదర్శించటానికి కేజ్రీవాల్ కి పనికివస్తుందేమో కానీ, ఏ పార్టీయైనా ఇటువంటి అర్థం లేని దాడికి ఉసిగొలిపిందని అనుకోవటం మాత్రం సరికాదు.  ఎందుకంటే దానివలన ఇతర పార్టీలకు ఏ ప్రయోజనమూ ఉండదు.  అంతమంది మధ్యలో ఒక మనిషి వచ్చి చెంప మీద కొట్టటం వరకు చెయ్యగలడేమో కానీ అంతకంటే ఏమీ చెయ్యలేడు కదా.  అలా జరగకుండా ఇంకా అప్రమత్తంగా ఉంటారేమో కానీ, ఆ మాత్రానికే భయపడి నామినేషన్ ని ఉపసంహరించుకుంటారని కూడా ఎవరూ అనుకోరు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles