Temporary stay on announcement of municipal election results

Election 2014, temporary stay on announcement of Municipal election results, Election commission of India, Supremecourt stat on municipal results

temporary stay on announcement of Municipal election results

మున్సిపల్ ఎన్నికల ఫలితాల మీద స్టే

Posted: 04/04/2014 02:52 PM IST
Temporary stay on announcement of municipal election results

తాజాగా రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల మీద తాత్కాలికంగా స్టే విధిస్తూ సుప్రీం కోర్టు దీని మీద విచారణను ఏప్రిల్ 7 కి వాయిదా వేసింది.  ఈ లోపులో ఎన్నికల కమిషన్ నుంచి స్పందనను కూడా కోరుతూ నోటీస్ జారీ చెయ్యటం జరిగింది. 

లోగడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలను సార్వత్రిక ఎన్నికల తర్వాతనే వెల్లడి చెయ్యాలని సుప్రీం కోర్టు ఆదేశించటం జరిగింది.  అయితే ఎంపీటిసి జడ్పిటిసి ఎన్నికల విషయంలో కూడా ఫలితాలను ఎన్నికల తర్వాతనే వెల్లడి చెయ్యమని ఆదేశాలిమ్మని కోరుతూ హైకోర్టులో వేసిన పిటిషన్ మీద, ఈ ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికల మీద పడుతుందన్న అంశాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.  ఎవరికి వోటెయ్యాలో నిర్ణయించుకోలేనివాళ్ళకి వోటు వెయ్యటానికి అర్హత లేనట్లే నంటూ వ్యాఖ్యానించింది. 

అయితే, ఏప్రిల్ 2 కి బదులు ఏప్రిల్ 9 కి ఫలితాలను వెల్లడించమంటూ సుప్రీంకోర్ట్ లో అప్పీల్ కి వెసులుబాటు కలిగించింది.  సుప్రీం కోర్ట్ తన పరిధిలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ప్రకటించటం మీద తాత్కాలిక స్టే ఇస్తూ విచారణను 7 కి వాయిదా వెయ్యటం ద్వారా ఈ లోపులో అంటే ఏప్రిల్ 9 లోపులో ఎన్నికల కమిషన్ స్పందనను పరిశీలించటానికి కూడా అవకాశం లభించింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles