Aap contesting for 70 assembly seats in ap

AAP contesting for 70 assembly seats in AP, Aam Admi Party, Arvind Kejriwal, AAP B Ramakrishna Raju, AAP Pankaj Gupta, AAP Ajit Jha

AAP contesting for 70 assembly seats in AP

రాష్ట్రంలో 70 అసెంబ్లీ సీట్లకు ఆఆపా పోటీ

Posted: 03/24/2014 03:06 PM IST
Aap contesting for 70 assembly seats in ap

ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాలు, 42 పార్లమెంట్ స్థానాలలోనూ పోటీ చేస్తామని అంతకు ముందు చెప్పినా, ఇప్పుడు 70 వరకు అసెంబ్లీ స్థానాలలోను, 12 వరకు పార్లమెంటు స్థానాలలోనూ పోటీ చెయ్యటానికి మాత్రమే సిద్ధమైంది. 

ఈ విషయంలో మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ రాష్ట్ర పార్టీ నిర్వాహకుడు బి రామకృష్ణ రాజు, అభ్యర్థిత్వం కోసం చాలా దరఖాస్తులు వచ్చాయి కానీ యోగ్యులైన వారు తక్కువమందే ఉండటం వలన ఆఆపా అభ్యర్థుల సంఖ్యను తగ్గించటం జరుగుతోందని అన్నారు.  అభ్యర్థులను ఎంపిక చేసే విధానం ఆఆపాలో చాలా క్లిష్టమైనదని, చాలా మంది దరఖాస్తుదారులు వాటికి నిలబడలేకపోయారని రామకృష్ణరాజు అన్నారు. 

సీమాంధ్రలోని 13 జిల్లాలలోని అభ్యర్థులను, వారు పోటీ చేసే స్థానాలను నిర్ణయించటం కోసం ఆఆపా సోమవారం నాడు గుంటూరులో సమావేశమౌతోంది.  ఆ సమావేశంలో రాష్ట్రానికి చెందిన ఆఆపా నాయకుడితో పాటుగా ఆ పార్టీ జాతీయ నాయకులు పంకజ్ గుప్తా, అజిత్ ఝా లు కూడా పాల్గొంటారు.  అలాగే తెలంగాణా ప్రాంతం కోసం మంగళవారం మార్చ్ 25 న హైద్రాబాద్ లో అభ్యర్థుల జాబితాను స్థానాలను ఖరారు చేయబోతున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles