Political scenario like kurukshetra war

Political scenario like Kurukshetra war, Bharatiya Janata Party, Samajwadi party, Hara Hara Modi Modi mantra, Dwaraka Peeth, BJP Rajnadh Singh, Jaswant Singh, Digvijay Singh

Political scenario like Kurukshetra war

కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తున్న ఎన్నికల రాజకీయాలు

Posted: 03/24/2014 04:40 PM IST
Political scenario like kurukshetra war

కురుక్షేత్ర సమయంలో ఊహకు కూడా అందని సాంకేతిక అభివృద్ధి ఈ కాలంలో లభ్యమౌతోంది.  ఆ కాలంలో కేవలం ఒక్క సంజయుడికి మాత్రం దివ్య దృష్టి లభించి కురుక్షేత్రంలో జరుగుతున్నదంతా టివి లో చూసినట్లుగా పూసగుచ్చినట్లు ధృతరాష్ట్రుడికి చెప్తుంటాడు.  కానీ ఈ కాలంలో.  సెల్ ఫోన్లలో స్మార్ట్ ఫోన్లు, ఇంటర్ నెట్ తో అనుసంధానం, మరోచోటికి కదిలి వెళ్ళాలంటే విమానాలు, హెలికాప్టర్లు ఎంత సౌలభ్యం.  అప్పడు వివిధ అస్త్రాలుంటే ఇప్పుడు మీడియా అస్త్రం, ప్రీ పోల్ సర్వే అస్త్రం, అన్నిటికన్నా మించి వాగ్యుద్ధానికి పనికి వచ్చే మాటల ఈటెలున్నాయి.

కౌరవ పాండవులే ధ్యేయంగా వ్యక్తులు, సమూహాలు మద్దతు పలికితే ఇప్పుడు జాతీయ స్థాయిలో యుపిఏ, ఎన్ డిఏ లే ప్రధానంగా మిగిలిన పార్టీలు, వ్యక్తుల చేరికలు జరుగుతున్నాయి.  

అగ్ర నాయకులంతా దేశంలో రాజకీయ రంగంలో జరుగుతున్న మార్పులను వెయ్యికళ్ళతో చూడటానికి నిరంతరం పనిచేసే సిబ్బందిని పెట్టుకున్నారు.  దాని వలన, ఎక్కడ ఏం జరిగినా తమ పార్టీ ప్రయోజనం దృష్టిలో దాని గురించి వ్యాఖ్యానాలు చెయ్యగలుగుతున్నారు.  

భాజపాలో సీటు అడ్జస్ట్ మెంట్ లో జస్వంత్ సింగ్ కి ఆయన అడిగిన స్థానం కేటాయించనందుకు  కాంగ్రెస్ నుంచి జస్వంత్ సింగ్ కి ఓదార్పులు లభించాయి.  ఆ స్థానంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కూడా అయ్యో పాపం అంత సీనియర్ మనసు నొప్పించారే అన్నారు.  

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఈ సంఘటన మీద మాట్లాడుతూ నరేంద్ర మోదీ ఏం తలచుకుంటే అది ఐపోతుంది అన్నారు- ఇదంతా నరేంద్ర మోదీ వలనే జరగిందన్న సంకేతాన్నిస్తూ.  కొన్ని టివి ఛానెల్స్ కూడా ఈ ఘటనలో మోదీ రాజకీయ చతురతను ఆపాదించాయి.  అద్వానీ, జస్వంత్ సింగ్ లాంటి సీనియర్స్ ని మోదీ కావాలనే బయటకు పోయే సందర్భాన్ని కలిగిస్తున్నారని, అందుకు కారణం రేపు అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత ఈ నాయకులతో చికాకులు రాకుండా కేవలం తన మనోభీష్టం ప్రకారమే నడవాలన్నది మోదీ ఆశయమని విశ్లేషించాయి.

ఈ లోపులో మోదీ ప్రభావం కూడా పార్టీలో శ్రుతి మించుతున్న భావన ఏర్పడుతోంది.  మోదీ వలనే భాజపాకి ప్రస్తుతమున్న ప్రాభవం అంత ఎత్తుకి ఎదిగిందన్నది నిర్వివాదం.  కానీ ఏ నాయకుడూ పార్టీని ఎదిగి పోవటం కూడా పార్టీ ప్రయోజనం దృష్ట్యా సరైనది కాదు కదా.  అందుకే పార్టీలో కార్యకర్తలు హర్ హర్ మోదీ ఘర్ ఘర్ మోదీ అనే మోదీ మంత్రానికి స్వస్తి చెప్తూ,  ఆ స్థానంలో అబ్కీ బార్ భాజపా సర్కార్ అనే నినాదాన్ని లేవనెత్తారు.  

అందుకు కారణం మరొకటి కూడా ఉంది.  సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు మోదీ మంత్రానికి అభ్యంతరాలు తెలిపాయి.  ఒక వ్యక్తిని దేవుడిలా స్తుతించటం తగదని అన్నాయి.  అందుకు మద్దతుగా ద్వారకా పీఠాధిపతి వ్యాఖ్యలు కూడా శివుని స్తుతించేటప్పుడు వాడే హర హర అనే పదాన్ని వక్రీకరించి హర హర మోదీ అని అనటం సరికాదని అన్నారు.

అందుకు మోదీ కూడా సమ్మతించారు.  ఆయన తన ట్విట్టర్లో, నాకు సహకరించే మద్దతుదారులు హర హర మోదీ అంటూ తమ ఉత్సాహాన్ని చూపించటాన్ని నేను గౌరవిస్తాను కానీ దయచేసి భవిష్యత్తులో ఆ నినాదాన్ని వాడకండి అని పోస్ట్ చేసారు.  

అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని, వ్యక్తి కాకుండా పార్టీకి గుర్తింపు పెరిగే విధంగా టైం ఫర్ ఛేంజ్, టైం ఫర్ బిజెపి అంటూ భాజపా అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్లో నినాదాన్ని సూచించారు.

రాజకీయ పార్టీలు, నాయకులు జీవితంలో ప్రతీదాన్ని ఎన్నికల రంగుటద్దాలలోనే చూస్తున్నారు.  ఈసారి తప్పితే జీవితంలో మరోసారి అవకాశం ఉండదేమో అన్న విధంగా పోటీకి తలపడుతున్నారు.  

మోదీ ప్రభంజనం దేశమంతా కనపడుతుంటే, కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులాగా వ్యాపిద్దామని చూస్తోంది.  వీలయినప్పుడల్లా భాజపాను ఎండగట్టే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది.  అందువలన భాజపా అంతర్గత విషయాల మీద కూడా వ్యాఖ్యానం చెయ్యటం జరుగుతోంది.  

ఒక్క విషయం మాత్రం నిజం.  ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా సీనియారిటీ లేనట్లయితే ఆర్ఎస్ఎస్ మద్దతు లేనట్లయితే ఇతర పార్టీల వారే కాదు- సొంత పార్టీలో కూడా కోడిగుడ్డుకి ఈకలు పీకే వారుంటారు కాబట్టి మోదీని ఈ స్థాయికి రానిచ్చేవారు కాదు.  పార్టీకి ఖ్యాతి తెచ్చే నాయకుడు కావాలి నిజమే కానీ, మరి నేను కూడా వెనకబడిపోగూడదన్న మనస్తత్త్వమే చాలామందిలో కనిపిస్తుంది కానీ పార్టీ కోసం స్వప్రయోజనాన్ని పక్కకు పెడదామనుకునే మనస్తత్వం కనపడదు.

ఇది ఇప్పటి వరకు జరిగినదానిలో కొంత భాగం మాత్రమే.  ఎన్నికలకు ఇంకా ఆరు వారాల సమయం ఉంది కాబట్టి బలోపేతం చేసుకునే ప్రక్రియలో పార్టీలు కిందా మీదా అయ్యే అవకాశం ఇంకా చాలా ఉంది.  రాజకీయ చదరంగంలో ఎత్తు పై ఎత్తులకు ఇంకా ఎంతో అవకాశం ఉంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles