Purandheswari tirupati rally

Purandheswari Tirupati rally, Former Congress Minister Purandheswari, Purandheswari joined BJP, BJP Tirupati program, Modi For PM program of BJP, State bifurcation, Telangana Bill

Purandheswari Tirupati rally, former minister of Congress party Purandheswari

పార్టీలో చేరుతూనే భాజపా ప్రచారంలో పురంధేశ్వరి

Posted: 03/10/2014 12:43 PM IST
Purandheswari tirupati rally

మాజీ కాంగ్రెస్ కేంద్ర మంత్రి పురంధేశ్వరి భాజపా తీర్థం పుచ్చుకుంటూనే ప్రచార కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు.  ఈరోజు తిరుపతిలో భాజపా భారీగా నిర్వహించిన మోదీ ఫర్ పిఎమ్ కార్యక్రమంలో మాట్లాడిన పురంధేశ్వరి సీమాంధ్రకు న్యాయం చేసే ప్రయత్నంలో రాష్ట్ర విభజన బిల్లులో వివిధ సవరణలను ప్రతిపాదించిందన్న విషయాన్ని మరువవద్దని, అందుమూలంగా ఆ పార్టీని ఆదరించాలని సీమాంధ్ర ప్రజలను కోరారు. 

కాంగ్రెస్ పార్టీ వైఖరి వలనే ఎందరో నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని, అది పార్టీని వీడాలని కాదు కాని పార్టీయే నాయకులను విస్మరించటం వలన అలా చెయ్యవలసివచ్చిందని అన్నారు.  సంవత్సరాల తరబడి కాంగ్రెస్ పార్టీలో విశ్వాసంగా పనిచేసిన నాయకుల మాటలకు విలువ ఇవ్వనందునే పార్టీని విడవవలసివచ్చిందని పురంధేశ్వరి అన్నారు. 

విభజన బిల్లులో సవరణలకు, సీమాంధ్ర ప్రజలకు న్యాయం చెయ్యటానికి భారతీయ జనతా పార్టీ ఎంతో కృషిచేసిందని, ఆ విషయాన్ని మరువవద్దని, అందుకు భాజపాని ఆదరించాలని సీమాంధ్ర ప్రజలను కోరారు పురంధేశ్వరి.
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, మంత్రి పదవికి రాజీనామా చేసిన పురంధేశ్వరి భాజపా అగ్ర నాయకుల సమక్షంలో ఈనెల 7న భాజపాలో చేరారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles