Dalit cm promised by jairam ramesh

Dalit CM promised by Jairam Ramesh, TRS party, K Chandrasekhara Rao, Dalit CM in Telangana, Tax holiday plans in Telangana

Dalit CM promised by Jairam Ramesh

సోనియా తెలంగాణా మాత కాదు నిర్మాత- జైరాం రమేశ్

Posted: 03/10/2014 12:16 PM IST
Dalit cm promised by jairam ramesh

కెసిఆర్ చెయ్యని పని మేము చేస్తాం అని కాంగ్రెస్ పార్టీ తమ పార్టీతో విలీనం చేస్తానని చివరి క్షణంలో మడమతిప్పిన తెరాస ప్రాభవాన్ని తెలంగాణాలో తక్కువ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నాలలో భాగం జైరాం రమేశ్, దళితుడిని తెలంగాణా ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు. 

మొదటి నుంచీ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానంటూ చెప్పుకుంటూ వచ్చిన మాటను కూడా పక్కన పెట్టిన కెసిఆర్, తెలంగాణాలో పటిష్టమైన ప్రభుత్వం ఉండటం ఈ సందర్భంలో చాలా అవసరమన్న వాదనతో తను, తన కుటుంబ సభ్యులు, తన అనుచరులతోనే తెలంగాణా రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకుందామని చూస్తున్నారు.  అయితే బిసిలను తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఆయన బిసి అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు.

ఇప్పుడు కెసిఆర్ తమకే కాదు దళితులకు చేసిన వాగ్దానాన్ని కూడా విస్మరిస్తున్నారనే భావన ప్రజలలో కలిగేవిధంగా కాంగ్రెస్ పార్టీ దళిత ముఖ్యమంత్రి ప్రకటనను జైరాం రమేశ్ ద్వారా చేసింది. 

కరీం నగర్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన జైరాం రమేశ్ సోనియా గాంధీ తెలంగాణాకు మాత లా కాకుండా నిర్మాతలా అభివృద్ధి చేస్తుందన్న మాటను గట్టిగా చెప్పారు. 

తెలంగాణాలో ఎన్నికల సందర్భాన్ని తన సొంత పార్టీ పట్టు కోసమే పట్టుదలతో ముందుకు సాగుతున్న కెసిఆర్ వ్యూహాన్ని ఛేదించటం కోసమన్నట్లుగా జైరాం రమేశ్ తెలంగాణా కోసం పాటుబడ్డ జెఏసి నాయకులు వస్తానంటేరాజకీయాలలో ప్రవేశం కల్పిస్తామంటూ ప్రకటన చేసారు.  దీనితో, తెరాసలో లేని ఉద్యమ నాయకులు కూడా కాంగ్రెస్ వైపు దృష్టి పెట్టి కాలు సారించే అవకాశం ఉంది.

ఆంధ్రా ప్రాంతానికే ఎక్కువ వరాలిచ్చారనుకోకుండా, పన్ను రాయితీ తెలంగాణాలో కూడా ఉంటుందని జైరాం రమేశ్ అన్నారు.  అయితే రాజ్యసభలో ఆఖరు రోజులన ప్రధానమంత్రి కేవలం సీమాంధ్రలో ప్రత్యేక కేటగిరీ గురించి మాత్రమే ప్రకటన చేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles