Chandrababu advice to pawan and kiran

Chandrababu advice to Pawan and Kiran, Telugu Desam Party, Congress party, Former Chief Minister Kiran Kumar Reddy, Clash between Congress TDP, Clash between Congress BJP

Chandrababu advice to Pawan Kalyan and Kiran Kumar Reddy

పవన్, కిరణ్ లకు చంద్రబాబు ఆలోచించదగ్గ సలహా

Posted: 03/10/2014 09:10 AM IST
Chandrababu advice to pawan and kiran

కొత్త పార్టీ పెడుతున్న సినీ హీరో పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ లకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఒక మంచి ఆలోచనతో సలహా ఇచ్చారు.  అదేమిటంటే, వాళ్ళు సీమాంధ్రకు మంచి చేసే పనిలో మంచి కంటే చెడు చేస్తున్నారేమో ఆలోచించుకోండని. 

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు, వాళ్ళిద్దరూ కొన్ని సీట్లను సంపాదించుకోగలిగినా దాని వలన పెద్దగా ప్రయోజనమేమీ ఉండదని, వారు దానితో ప్రజలకు సేవ చెయ్యలేరని, దానికంటే వాళ్ళు నిజంగా సీమాంధ్ర ప్రజలకు మేలు చెయ్యదలచుకుంటే తెలుగుదేశం పార్టీకి మద్దతునిచ్చే దిశగా ఆలోచించమని అన్నారు. 

ఒక విధంగా చంద్రబాబు నాయుడు చెప్పేది సరైనదేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.  వోట్లను చీలగొడుతూ, ఎన్ని ఎక్కువ పార్టీలుంటే ఓడిపోతున్నదని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి అంత బలమవుతుందన్నది సత్యమే.
దేశంలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉంది.  దేశమంతా పర్యటిస్తూ కష్టపడి భాజపాకి ప్రజలలో నమ్మకాన్ని తీసుకొస్తుంటే, పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే పార్టీలు, పార్టీ కూటమిలు కాంగ్రెస్ వ్యతిరేక వోట్లను చీల్చి వేస్తాయి. దానితో కాంగ్రెస్ ని సమూలంగా పొయేట్టుగా చేస్తామని చెప్పుకొస్తున్న పార్టీలకు ఆ పని కష్టసాధ్యమౌతుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles