Daily laborers scarcity in elections

daily laborers scarcity in elections, elections boon for daily laborers, Assembly Parliament election, Municipal elections in AP

daily laborers scarcity in elections

జైజైల కూలీల ఎన్నికల పండుగ

Posted: 03/10/2014 09:58 AM IST
Daily laborers scarcity in elections

రాష్ట్రంలో వ్యవసాయానికి కాని, నిర్మాణాలకు కాని ఇతర కాంట్రాక్ట్ పనులు చేసే కూలీల కొరత భారీగా ఏర్పడింది.  మేస్త్రీలు, సూపర్ వైజర్లు, కాంట్రాక్టర్లు రోజు కూలీల కొరతతో తమ ఆదాయాన్ని పోగొట్టుకుంటున్నారు. 

వీటన్నిటికీ కారణం ఎన్నికలు.  దేశంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా వ్యూహప్రతివ్యూహాలు, ఎదుటి పార్టీ మీద బురదచిందులు చల్లటాలు, పార్టీలు మారటాలు, పార్టీ మారినవారు అంతకు ముందు పార్టీని ఎండగట్టటాలు, విమర్శలు, వోటర్లకు వాగ్దానాలు ఇవన్నీ ఎలాగూ ఉండేవే.  కానీ ఎన్నికల ప్రచారాలకు, బహిరంగ సభలలో జనసమీకరణకు రోజుకూలీల అవసరం ఎంతైనా ఉంటుంది. 

రాష్ట్రంలో శాసనసభ, లోక్ సభ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో దేశంలో అందరూ ఎన్నికల జపాన్నే పఠిస్తున్నారు.

రోజు కూలీ ఒకరోజు దొరకొచ్చు ఒకరోజు లేదు కానీ ముమ్మరంగా సాగుతున్న ఎన్నికలపోరులో రోజుకూలీల పాత్ర ఎంతో ఉంటుంది.  రోడ్డు పని కానీ, కాలవ పని కానీ, ఇళ్ళ నిర్మాణం కానీ, ఆలయ నిర్మాణం కానీ ఇలా ఏదైనా పని దొరికితే చాలని అనుకుని కాయకష్టానికే అంకితమయ్యేవారికి ఎన్నికలు పెద్ద వరంగానే సాగుతోంది.  మే నెలాఖరు వరకు ఇది ఇలాగే సాగే అవకాశం ఉంది.  హైద్రాబాద్ లాంటి నగరాలు వస్తే వాళ్ళకి ఉచిత రవాణాతో వచ్చి నగరాన్ని చూసినట్లూ ఉంటుంది, రోజు కూలీతో పాటు తిండి సమస్య కూడా తీరిపోతుంది. 

అందువలన అడ్డాల మీద ఎప్పుడు చూసినా కనిపించే కూలీలు కంటికి కనపడటం లేదు.  ఇళ్ళ నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి.  ఎన్నికలు ఫలితాలు, ఆ తర్వాత విజయోత్సవాలు జరిగిన తర్వాత వర్షాకాలం వచ్చి రోజు కూలీకి అవకాశం తగ్గిపోయినా బాధపడకుండా ఎన్నికలలో సంపాదించినవాళ్ళకు సంపాదించినంత.  వాళ్ళకంటే ఎక్కువ లాభం పొందేవాళ్ళు రోజుకూలీకి పనిచేసే కూలీలను సప్లై చేసే కాంట్రాక్టర్లు. 

ఆలయాలకు పనిచేసేవాళ్ళకి ఆ ఆలయంలోని దేవుడితో ఎటువంటి సంబంధం లేనట్లుగా,  రోడ్డు పని చేసేవాళ్ళకి ఆ రోడ్డు ఎటుపోతుందో అనవసరం, ఇళ్ళ పని చేసే వాళ్ళకి ఆ ఇళ్ళల్లో ఎవరు నివసిస్తారో తెలియదు, ఎన్నికలలో నిలబడేవాళ్ళల్లో ఎవరు గెలుస్తారు ఎవరు వోడతారన్న పట్టింపు ఉండదు.

కానీ అందులో చాలామందికి తెలిసింది ఒకటే సంపాదిస్తే ఇప్పుడే, మళ్ళీ చాలా సంవత్సరాల వరకు ఈ అవకాశం రాదట అని.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles