Aap donations boosted after clashes

AAP donations boosted after clashes, Arvind Kejriwal, AAP donations for Lok Sabha electons, AAP donations for Assembly elections, BJP, AAP clash

AAP donations boosted after clashes, Arvind Kejriwal

సామాన్యమానవుడి అసామాన్య విజయం!

Posted: 03/07/2014 09:14 AM IST
Aap donations boosted after clashes

పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదన్న సామెతను నిజం చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ని గుజరాత్ లో అడ్డుకోవటం, దరిమిలా ఆయనకు అడుగడుగునా నిరసనలు, మిగతా రాష్ట్రాలలో కూడా భాజపా ఆఆపా మధ్య జరిగిన సంఘర్షణల ఫలితం ఆఆపా పార్టీ చందాల మీద అనుకూలంగా చూపించింది.  చందాలు రెండున్నర రెట్లు పెరిగాయి. 

ఆఆపాను ఎవరు అడ్డుకున్నా వాళ్ళకి మద్దతు లభించటమే కాకుండా చందాల రూపంలో కూడా సాయం వెల్లువెత్తటం జరుగుతోంది.  గుజరాత్ లో ఆఆపాను అడ్డుకోకముందు రోజు చందాల వసూళ్ళు 6 లక్షల డెబ్భై వేలైతే, ఆ తర్వాత రోజు చందాలు 24 లక్షలు అంటే వృద్ధి చూసుకుంటే రెండున్నర రెట్లు.  మామూలుగా సోమవారం నుండి శనివారం వరకు పార్టీ చందాలు రోజుకి 8 నుంచి 10 లక్షల వరకు ఉంటాయి.  అలాంటిది గురువారం వరకే 20 లక్షల రూపాయలు వసూలయ్యాయి. 

విచిత్రమేమిటంటే ఆఆపా కు అవమానం జరగటం, కష్టం కలగటం జరిగినప్పుడే కాదు సంతోష సమయంలో కూడా చందాలు పెరుగుతున్నాయి.  జనవరి 1 నాడు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఆఆపా చందాలు 41 లక్షలకు చేరుకున్నాయి. 

దేశ విదేశాలనుంచి ఆఆపా కు వచ్చిపడుతున్న చందాలు కేవలం లోక్ సభ ఎన్నికల కోసమే గత మూడు నెలలుగా వసూలైనవి 11 కోట్ల రూపాయలు.  అదే ఢిల్లీ శాసన సభ ఎన్నికలకోసం సంవత్సరమంతా కలిసి వసూలైన చందాలు అందులో సగమే! 

ఇది సామాన్యమానవుడి (ఆమ్ ఆద్మీ) అసామాన్య విజయ!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles