Ghmc mayor ready to resign

GHMC Mayor ready to resign, Majid Hussain, MIM party, Nampally Assembly seat, Akbaruddin Owaissi

GHMC Mayor ready to resign, Majid Hussain

హైద్రాబాద్ మేయర్ రాజీనామా

Posted: 03/07/2014 08:26 AM IST
Ghmc mayor ready to resign

గ్రేటర్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ రాజీనామా చెయ్యటానికి సిద్ధంగా ఉన్నారు.  మేయర్ హోదాలా ఉంటూ నాంపల్లిని అభివృద్ధి పరచిన మేయర్ మొహమ్మద్ మాజిద్ హుస్సేన్ మజ్లిస్ పార్టీ తరఫున నాంపల్లి నుంచి శాసనసభకు పోటీచెయ్యటానికి వీలుగా రాజీనామా చేసే నిర్ణయం తీసుకున్నారు. 

తాను రాజీనామా చెయ్యటానికి కారణం మజ్లిస్ లోని అగ్రనేతలు చేసిన హామీలే నంటూ మేయర్ తన సన్నిహతులతో అన్నారు. 

మజ్లిస్ పార్టీ నాంపల్లి మీద పట్టు పోగొట్టుకోదలచుకోలేదు.  ఆ పార్టీలో అగ్రనేతలైన సలావుద్దీన్ ఒవైసి, అక్బరుద్దీన్ ఒవైసి లకు మాజిద్ అత్యంత విశ్వాసపాత్రుడుగా వ్యవహరస్తూ వచ్చారు.  పోయిన సారిలా నాంపల్లి శాసనసభ సీటుని దక్కించుకోవటానికి నానా కష్టాలు పడకుండా ఈ సారి అభివృద్ధి చేసిన యువ నాయకుడిని నిలబెడితే గెలుపు ఖాయమని మజ్లిస్ పార్టీ నమ్ముతోంది. 

ఈసారి హైద్రాబాద్ సికింద్రాబాద్ లలో మరింత పట్టు సాధించాలని ఎమ్ఐఎమ్ పార్టీ చేస్తున్న ప్రయత్నంలో మాజిద్ హుస్సేన్ ని నాంపల్లి నుంచి పోటీలో నిలబెట్టటం ఒకటి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles