Trs going congress way

TRS going Congress way, TRS President K Chandrasekhara Rao, Congress party of India, TRS political party, Telangana Bill, AP State Reorganization Bill 2014

TRS going Congress way, TRS President K Chandrasekhara Rao

కాంగ్రెస్ దారిలో నడుస్తున్న తెరాస

Posted: 03/04/2014 08:14 AM IST
Trs going congress way

కాంగ్రెస్ పార్టీలో విలీనం చెయ్యటం లేదు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదు, ఒంటరి పోరాటమే చేస్తానంటున్న తెలంగాణా రాష్ట్ర సమితి అందుకు కారణాలను సహేతుకంగా చెప్పింది.  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి  తెలంగాణా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన తర్వాత ఇప్పటివరకూ విలీనం విషయంలో ఇదమిద్ధంగా తేల్చని తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు సోమవారం ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేస్తూ చెప్పిన ప్రధానాంశాలలో ఒకటి, ఇప్పుడు తెరాస రాజకీయ పార్టీయే అని ప్రకటనచెయ్యటం. 

ఇంతకు ముందు వరకు ఉద్యమ పార్టీగా ఉన్న తెరాస ఇప్పుడు రాజకీయ పార్టీ అని అన్నారు కెసిఆర్.  1947 వరకు ఉద్యమ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తర్వాత రాజకీయ పార్టీగా ఎదిగినట్లుగానే తెరాస కూడా ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది.  దేశ స్వాతంత్ర్యానికి పోరాటం సల్పిన కాంగ్రెస్ పార్టీ కూడా స్వాతంత్ర్యం తర్వాత ఆ ఘనకీర్తిని చక్కగా ఉపయోగించుకుంది.  అందుకే ఆ కీర్తి ప్రతిష్టలను పదిలపరచుకోవటం కోసం ఇందిరా గాంధీ స్థాపించిన కాంగ్రెస్ (ఐ) ని కూడా నేషనల్ కాంగ్రెస్ గా పేరు మార్చటం జరిగింది. 

అదే బాటలో తెరాస కూడా ఉద్యమంలో చేసిన త్యాగాలు, కష్ట నష్టాలను గుర్తు చేసుకుంటూ ఆ కీర్తిని ఉపయోగించదలచుకున్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది, కాంగ్రెస్ చేస్తే తప్పు లేనప్పుడు తెరాస చేసినా అందులో తప్పు పట్టటానికేమీ లేదు. 

ఇక పోతే విలీనం విషయంలో వాగ్దానం చేసినా, కార్యకర్తల సూచన మేరకు విలీనం చెయ్యకుండా ఉండాలన్న నిర్ణయం తీసుకున్నానన్నారు కెసిఆర్.  కొందరు చీటీల మీద రాసిచ్చారు, కొందరు ఎస్ఎమ్ఎస్ లు పంపించారు, మొత్తానికి విలీనానికి వ్యతిరేకంగానే కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలు ఉండటం వలన కెసిఆర్ తెరాసను ఒంటరి పోరాటంలోకే దింపుతున్నామని వెల్లడిచేసారు. 

కెసిఆర్ ఇంకా కారణాలు చెప్పారు.  అంధ్రాలో తెదేపా, వైకాపా రెండు ప్రాంతీయ పార్టీలున్నప్పుడు తెలంగాణాలో లేకపోతే ఎలా అన్నది ఆయన ప్రశ్న. 

కాంగ్రెస్ పాలనలోనే ఉద్యమం అందుకుందంటే కాంగ్రెస్ న్యాయం చెయ్యనట్లే కదా.  చివరి వరకూ కాంగ్రెస్, భాజపాలు నాటకాలాడుతూనే వున్నారని, తాను ఢిల్లీ పోయేంతవరకూ ఆ ఆటలు అలాగే సాగుతూనేవున్నాయని తాను వెళ్ళిన తర్వాతనే రాష్ట్ర విభజన బిల్లు ముందుకు కదిలిందని చెప్పిన కెసిఆర్, తెలంగాణా అభివృద్ధికి పటిష్టమైన నాయకత్వం ఎంతో అవసరమని కూడా చెప్పారు.  అదీ గాక తెలంగాణా బిల్లుని తమని సంప్రదించకుండానే ఫైనల్ చేసారని, ఎన్నో లొసుగులతో కూడిన బిల్లుని ప్రవేశపెట్టారని, అది తమకు సమ్మతం కాదని, భవిష్యత్తులో వాటిని కూడా సరిచెయ్యాలంటే కాంగ్రెస్ లో విలీనమైతే అది సాధ్యం కాదని కెసిఆర్ వివరించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles