Bangaru lakshman passed away

Bangaru Lakshman passed away, Bharatiya Janata Party, Bangaru Lakshman last rites, L K Advani, Rajnath Singh, Narendra Modi

Bangaru Lakshman passed away, Bharatiya Janata Party

భాజపా దళిత నాయకుడు బంగారు లక్ష్మణ్ మృతి

Posted: 03/02/2014 10:11 AM IST
Bangaru lakshman passed away

భారతీయ జనతాపార్టీలో కార్యకర్తగా మొదలుపెట్టి అంచలంచలుగా జాతీయస్థాయికి ఎదిగిన దళిత నాయకుడు బంగారు లక్ష్మణ్ (74) శనివారం సాయంత్రం 5.15 కి కన్నుమూసారు.  గుండెకు సంబంధించిన వ్యాధులతో చాలాకాలంగా బాధపడుతున్న బంగారు లక్ష్మణ్ నెలరోజుల నుంచి సికింద్రాబాద్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ, వివిధ అవయవాల లోపంతో మరణించారు. 

ఆయన మరణ వార్త వినగానే భాజపా నాయకులు విద్యా సాగరరావు, బద్దం బాలిరెడ్డి ఇంకా ఎందరో భాజపా నాయకులు, కార్యకర్తలు హాస్పిటల్ కి తరలి వెళ్ళి అశ్రునయనాలతో అమరజీవికి నినాదాలు చేసారు. 

మార్చి 17, 1939 న జన్మించిన బంగారు లక్ష్మణ్ 1953లో 12 సంవత్సరాల వయసులోనే ఆర్ఎస్ఎస్ లో చేరారు.  ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ, అనంతరం లా డిగ్రీ చదివిన బంగారు లక్ష్మణ్ విద్యుత్ రైల్వే శాఖలలో పని చేసారు.  1969 లో ఆయన ఉద్యోగాలకు స్వస్థి చెప్పి రాజకీయాలలో అడుగుపెట్టారు.  ఆర్ఎస్ఎస్ లో వివిధ బాధ్యతలను నిర్వహించి ట్రేడే యూనియన్లలో కార్మికుల తరఫున పోరాటాలు సాగించారు.  ఉద్యమాలలో పలుమార్లు జైలుకి వెళ్ళారాయన.  భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసారు.  1985-86 లో రాష్ట్ర శాసన మండలికి, 1996 లో గుజరాత్ నుండి రాజ్యసభకు ఎంపీగానూ ఎన్నికయ్యారు.  2000 లో బంగారు లక్ష్మణ్ భాజపా తొలి దళిత జాతీయ అధ్యక్షుడిగా తెలుగు రాష్ట్రానికి, దళితులకు పేరు తెచ్చారు. 

అయితే సుదీర్ఘకాలం దళితుల కోసం, కార్మికుల కోసం, పార్టీ కోసం పనిచేసిన ఆయన జీవితంలో జరిగిన అపశృతి సైన్యానికి చేసిన పరికరాల కోనుగోళ్ళలో జరిగిన అవకతవకల విషయంలో తెహల్కా చేసిన స్టింగ్ ఆపరేషన్ లో ఆయన పట్టుబడి జైలు శిక్ష అనుభవిస్తున్నారు.  అనారోగ్య రీత్యా బెయిల్ మీద చికిత్స పొందుతూ మరణించారు. 

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, భాజపా ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ బంగారు లక్ష్మణ్ మృతికి తీవ్ర ఆవేదనను సంతాపాన్ని తెలియజేసారు.  తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తెరాస అధ్యక్షుడు కెసిఆర్, తమిళనాడు గవర్నర్ రోశయ్య, మాజీ మంత్రి మాణిక్య వరప్రసాద రావు ఇంకా ఎందరో నాయకులు బంగారు లక్ష్మణ్ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసారు.

భాజపా పార్టీ కార్యాలయంలో ఈ రోజు మధ్యాహ్నం 12.00 గంటల వరకు బంగారు లక్ష్మణ్ పార్ధివ శరీరాన్ని సందర్శనార్థం ఉంచుతారు.  ఈ రోజు సాయంత్రం 4.00 గంటలకు పంజాగుట్ట స్మశానవాటికలో జరుగుతున్న బంగారు లక్ష్మణ్ అంతిమ సంస్కారానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత లాల్ కిషన్ అద్వాణీ హాజరుకాబోతున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles