Somah solution to preserve organs for a week

Somah solution to preserve organs for a week, Dr Hemanth Thate, Gala solution, blood vessels preservation, Somah solution organs preservation, Dr Thate Somah solution, Dr Thate Gala solution

Somah solution to preserve organs for a week, Dr Hemanth Thate

భారతీయ శాస్త్రవేత్త కనుగొన్న సోమరసం

Posted: 02/21/2014 11:41 AM IST
Somah solution to preserve organs for a week

సోమరసంతో శరీరావయవాలు ఎక్కువ రోజులు సురక్షితం! చనిపోయినవారి శరీరావయవాలను వేరే శరీరంలో అమర్చటానికి చేసే ట్రాన్స్ ప్లాన్టేషన్ లో ఉపయోగించే గుండె, ఊపిరితిత్తులను ప్రస్తుతం నాలుగు నుంచి ఆరు గంటల వరకు మాత్రమే భద్రపరచగలుగుతారు.  లివర్ విషయంలో ఎనిమిది గంటలు, కిడ్నీ విషయంలో 24 గంటలు భద్రపరచి వుంచవచ్చు.  కానీ భారతీయ మూలాలు గల డాక్టర్ హేమంత్ థాటే కనుగొన్న రసం (సొల్యూషన్) తో మెదడు ఆగిపోయిన తర్వాత శరీరంలోంచి తీసే అవయవాలను వారం రోజుల వరకు చెడిపోకుండా ఉంచి వేరే శరీరంలో ట్రాన్స్ ప్లాన్టేషన్ కి ఉపయోగించవచ్చు. 

ఈ సొల్యూషన్ కి డాక్టర్ థాటే 'సోమ' అని పేరు పెట్టారు.  పూర్వకాలంలో తపోధనులైన మునులు 'సోమరసాన్ని' తయారు చేసుకుని తద్వారా శరీరంలో వృద్ధాప్యం రాకుండా చూసుకోగలిగేవారట.  సంస్కృతంలో ఉన్న ఆ పేరునే వాడుతూ డాక్టర్ థాటే తను ఆవిష్కరించిన రసానికి 'సోమ' అని పెరుపెట్టారు. 

సోమ రసాన్ని ఉపయోగించి భద్రపరచటం వలన చనిపోయిన శరీరంలోంచి తీసిన అవయవాలను హడావిడిగా గంటల కొన్ని గంటల లోపులోనే వాటి అవసరం ఉన్న రోగి వరకు చేర్చవలసి వుంటుంది.  కానీ ఇందులో కలిగిన అభివృద్ధి వలన ఇప్పుడు అవసరమైతే ఖండాతరాలకు కూడా అవయవాలను పంపించవచ్చు.  సాంకేతికంగా చెప్పాలంటే ఈ సోమరసం శరీరావయవాలలో సహజంగా జరిగే క్షయం వేగాన్ని తగ్గిస్తుంది.  అంతే కాకుండా వీటిని సోమ లో కలిపి మామూలుగా గదిలో ఉండే వాతావరణంలోనే భద్రపరచవచ్చునన్నది డాక్టర్లకు పెద్ద ఉపయోగం. 

హార్వార్డ్ లో 20 సంవత్సరాల క్రితం డాక్టర్ థాటే కనుగొన్న 'గాలా' రసాన్ని పది సంవత్సరాలుగా గుండెకు చేసే శస్త్ర చికిత్సలో బైపాస్ సర్జరీకి ఉపయోగపడే రక్తనాళాలను భద్రపరచటానికి ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు.  సోమ ని మాత్రం ఇంకా వైద్యనిపుణులు పరీక్షణల ఉంచారు.  అది పూర్తిగా వాడకంలోకి రావటానికి మరో సంవత్సర కాలం దాన్ని పరీక్షించవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.  ఎందుకంటే, టోరంటో జనరల్ హాస్పిటల్ లో డాక్టర్ వివేక్ రావు మాటల్లో చెప్పాలంటే, వేలాది సొల్యూషన్స్ అలాంటివి తయారయ్యాయి, అందరూ చెప్పేది అదే- వాళ్ళు తయారు చేసింది మైలైందని. 

సోమా మీద వివరాలను మొదటిసారిగా డాక్టర్ థాటే అక్టోబర్ 2009 లో మెడికల్ జర్నల్ లో ప్రచురించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles