Rajya sabha clears telangana bill

Telangana, Rajya Sabha clears Telangana Bill, BSP, SP, Venkaiah Naidu, Chiranjeevi, Mayawati, KVP Ramchander Rao, Package to Seemandhra, Rajya sabha clears Telangana Bill, Rajya Sabha approved Telangana Bill, T-Bill, Telangana Bill in Rajya Sabha, bifurcation of Andhra Pradesh,

Rajya Sabha clears Telangana Bill

రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందిన టి-బిల్లు

Posted: 02/20/2014 08:13 PM IST
Rajya sabha clears telangana bill

రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందింది. బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఓటింగ్ జరపాలని విపక్ష నేతలు పట్టుబడినప్పటికీ, డిప్యూటీ స్పీకర్ కురియన్ మూజువాణి ఓటుకే మొగ్గుచూపారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ ముగిసిందని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించారు. బిల్లుకు సవరణ ప్రతిపాదనను బీజేపీ ఎంపీ వెంకయ్యనాయుడు ప్రవేశపెట్టారు. అయితే, వెంకయ్యనాయుడు సవరణ ప్రతిపాదన వీగిపోయినట్లు డిప్యూటీ ఛైర్మన్ ప్రకటించారు. సవరణలపై మూజువాణి ఓటింగ్ ను డిప్యూటీ ఛైర్మన్ కురియన్ నిర్వహించారు

ప్రధాని హామీలు     

సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రధాని మన్మోహన్ తెలిపారు. హైదరాబాదు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రధానిపై పేపర్లు చింపి వేస్తున్న విపక్ష సభ్యులు.     

ఓటింగ్ 

సభ్యులు ప్రతిపాదించిన సవరణలపై ప్రస్తుతం ఓటింగ్ జరపటం జరిగింది. అయితే, మూజువాణి పద్దతిలోనే ఓటింగ్ జరుగుతోంది. పదేళ్ల పాటు సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించాలన్న వెంకయ్యనాయుడు ప్రతిపాదన సభలో వీగిపోయింది. కేవలం ఐదేళ్ల పాటే ప్రత్యేక హోదా ఉంటుందని తీర్మానించారు.

రాష్ట్రపతికి చేరనున్న తెలంగాణ రాష్ట్ర బిల్లు    

పార్లమెంటు ఉభయసభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. మంగళవారం నాడు లోక్ సభలో పాసైన టీబిల్లు, ఈ రోజు రాజ్యసభలో కూడా పాస్ అయింది. ఇరు సభల్లో ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు. . బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయంగానే... మన దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles