Cm ramesh dispute with chiranjeevi in rajya sabha

Chiranjeevi, telangana bill, rajya sabha, CM Ramesh, congress party, tdp, ysrcp, chandhrababu naidu, Chiranjeevi in Rajya Sabha, telangana, seemandhra.

CM Ramesh Dispute With Chiranjeevi in Rajya Sabha, CM Ramesh Attaking On Rajya Sabha member chiranjeevi

సభలో విభజన పై చిరు పైట్-దూసుకొచ్చిన టిడిపి ఎంపీలు?

Posted: 02/20/2014 06:03 PM IST
Cm ramesh dispute with chiranjeevi in rajya sabha

కేంద్రం మంత్రిగా నేను  మొదటి సారి సభలో మాట్లాడుతున్నానని... అందువల్ల సభ్యులందరూ సహకరించాలని  కేంద్రం మంత్రి కె. చిరంజీవి కోరారు. రాష్ట్ర విభజన బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ వాదిగా ఉంటూ సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం బాధాకరంగా ఉందని చెప్పారు. 

రాష్ట్ర విభజన అనేది 11 కోట్ల మంది  తెలుగు వారి గుండె కోతకు సంబంధించిన అంశమని తెలిపారు. వ్యక్తిగతంగా తాను సమైక్యవాదినైనా, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. 

లోక్ సభలో బిల్లుపై చర్చలో ఎవరికీ అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమని... రాజ్యసభలోనైనా సీమాంధ్రులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చిరంజీవి కోరారు.  

అంతేకాకుండా  ఆంద్రప్రదేశ్ ప్రజలు బాధతో, ఆవేశంతో  విడిపోకూడదని   చిరంజీవి అన్నారు.   తెలంగాణకు  అన్ని  పార్టీలు  తమ వైఖరి ప్రకటించిన అనంతరమే కాంగ్రెస్  నిర్ణయం తీసుకుందన్నారు.  

అయితే విభజన  అంశంలో  కేంద్రం అనుసరించిన తీరు బాగాలేదన్నారు.  లోక్ సభలో బిల్లు ఆమోదించిన తీరు బాధాకరమన్నారు. హైదరాబాదు అభివృద్ధిలో సీమాంధ్రుల పాత్ర ఎంతో ఉందని రాజ్యసభలో ప్రసంగిస్తూ చిరంజీవి అన్నారు. అందువల్ల హైదరాబాదుని యూటీ చేయాలని చిరంజీవి కోరారు. 

తాను వ్యక్తిగతంగా విభజనను వ్యతిరేకిస్తున్నప్పటికీ, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చిరంజీవి తెలిపారు. దీనికి అరుణ్ జైట్లీ అడ్డుతగులుతూ, ఆయన ప్రభుత్వంలోని మంత్రిగా మాట్లాడుతున్నారా? లేక సభ్యుడిగా మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. 

దీనికి చిరంజీవి బదులిస్తూ తాను ప్రజల తరపున మాట్లాడుతున్నానని చిరంజీవి చెప్పారు.   అదే సమయంలో  చంద్రబాబు, జగన్, కిరణ్ లపై విమర్శలు చేశారు. ఆర్టికల్-3 ద్వారా రాష్ట్రాన్ని విభజించవచ్చని చెప్పింది వైఎస్సార్సీపీయే అని చెప్పారు. ఇదే సమయంలో చంద్రబాబుపై కూడా చిరంజీవి విమర్శలు చేశారు. 

ఆయన సమన్యాయం ఏమిటంటూ ప్రశ్నించారు. సీఎం కిరణ్ కూడా తాను పార్టీ అధిష్ఠానానికి అనుగుణంగానే ఉంటానని చెప్పారని... చివర్లో మాట తప్పారని అన్నారు. దీంతో, సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడటం సరికాదంటూ తోటి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

సరైన సమాచారం లేకుండా లోక్ సభలో బిల్లును పాస్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ కృష్ణ కమిటీ సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. రాష్ట్ర విభజన అంశంలో తెలుగుదేశం వైఖరిని  చిరంజీవి  తప్పుబెట్టడంతో  తెలుగుదేశం సభ్యులు తీవ్రనిరసన వ్యక్తం చేశారు.  

చిరంజీవిపైకి దూసుకెళ్లిన సీఎం రమేష్    

రాజ్యసభలో చర్చ సందర్భంగా మాట్లాడుతున్న కేంద్రమంత్రి చిరంజీవిపై దూసుకెళ్లేందుకు టీడీపీ ఎంపీ సీఎం రమేష్ యత్నించారు. సమన్యాయమంటే ఏమిటని టీడీపీ అధినేత చంద్రబాబును సభలో ప్రశ్నించడంపై మండిపడ్డ రమేష్ చిరు చేతిలో పేపర్ లాక్కునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వేరే సభ్యుడొకరు వచ్చి రమేష్ ను అడ్డుకున్నారు.

ప్రధాని సమక్షంలో చిరు విమర్శలపై జైట్లీ అభ్యంతరం    

రాజ్యసభలో రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడుతున్న కేంద్ర మంత్రి చిరంజీవి ప్రధానమంత్రి ఎదురుగానే సభలో విభజనపై విమర్శలు చేయడాన్ని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ తప్పుబట్టారు.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles