No consensus after pm bjp meet telangana bill not discussed in rs

sonia gandhi, manmohan singh, telangana bill, rajya sabha, bjp, venkaiah naidu, cm ramesh, seemandhra.

No consensus after PM-BJP meet-Telangana bill not discussed in RS

రాజ్య సభ పై అమ్మ కన్ను- టి- బిల్లు పై నాయుడు ఫైట్ ?

Posted: 02/19/2014 07:18 PM IST
No consensus after pm bjp meet telangana bill not discussed in rs

రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే మంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ఏ ప్రాతిపదికన విభజిస్తున్నారంటూ మాట్లాడేందుకు ప్రయత్నించగా, బిల్లుపై ఇంకా సభలో చర్చ చేపట్టలేదని, చర్చకు వచ్చినప్పుడు అవకాశం ఇస్తానని డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ చెప్పారు.

మరోవైపు సీమాంద్ర టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, కేవీపీ ప్లకార్డులతో ఎప్పటిలానే వెల్ లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో సభ కొనసాగలేని పరిస్థితి నెలకొనడంతో రేపటికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ ప్రకటించారు.

సీమాంధ్ర ప్రాంతానికి ప్యాకేజీపై ప్రధాని మన్మోహన్ సింగ్ తో బీజేపీ సీనియర్ నేతలు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు సమావేశం ముగిసింది. ఢిల్లీలో ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో నాలుగు ప్రధాన అంశాలపై సవరణలు చేయాలంటూ బీజేపీ పట్టుపట్టింది. దీంతో హైదరాబాద్ లో శాంతిభద్రతలు, ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ముంపు మండలాలు సీమాంధ్రలో కలపడం, పన్ను రాయతీలు వంటి అంశాలపై బీజేపీ పట్టుపట్టినట్టు సమాచారం. 

ఈ భేటీలో ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు జైరాం రమేష్, అహ్మద్ పటేల్, కమల్ నాథ్ లు కూడా పాల్గొన్నారు. అలాగే ఆర్థిక శాఖాధికారులను కూడా సమావేశానికి ఆహ్వానించి సాధ్యాసాధ్యాలపై చర్చించారు. కాగా సవరణలపై రాజ్యసభలో ప్రకటన చేస్తారని, బిల్లులో పొందుపరచడం ఉండదని తెలిపినట్టు సమాచారం. బిల్లులో పొందుపరిస్తే లోక్ సభలో మరోసారి దుమారం రేగే అవకాశం ఉందని అందువల్ల రాజ్యసభలో ప్రకటన చేస్తామని చెబుతున్నట్టు సమాచారం.

రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును ఆమోదింపజేయడం కాంగ్రెస్ పార్టీకి కష్టంగా మారింది. బీజేపీ సీనియర్ నేతలు వెంకయ్యనాయుడు. అరుణ్ జైట్లీలను ఒప్పించడానికి ప్రధానితో పాటు కాంగ్రెస్ అధిష్ఠానానికి ముచ్చెమటలు పడుతున్నాయి. లోక్ సభలో ఆమోదించేందుకు మద్దతిచ్చిన బీజేపీ, తాము సూచించిన ఒక్క సరవరణనూ చేపట్టకపోవడంతో పునరాలోచనలో పడింది.

రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ నేతలు ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. విభజన బిల్లుకు మద్దతిచ్చి తమ పార్టీ కూడా అలాంటి పరిస్థితుల్లో చిక్కుకోకుండా ఉండాలని బీజేపీ తీవ్రంగా యత్నిస్తోంది. అసలే బీజేపీకి సీమాంధ్రలో అనుకున్నంత ఆదరణ లభించడం లేదు. దీంతో సవరణలు సూచించి, సాధించి పార్టీ పరువు నిలుపుకోవచ్చని ఆ పార్టీ నేతల ఆలోచన

దీంతో బీజేపీ సీనియర్ నేతలు తాము సూచించిన సవరణలు బిల్లులో ప్రతిపాదిస్తే తప్ప రాజ్యసభలో బిల్లు గట్టెక్కే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. దీంతో బిల్లులో సవరణలు ప్రతిపాదిస్తే లోక్ సభలో మరో సారి చర్చించాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితే వస్తే లొక్ సభలో మరో సారి ఎలాంటి పరిణామాలు పునరావృతమవుతాయో కాంగ్రెస్ పార్టీ ఊహించలేని పరిస్థితి నెలకొంది. దీంతో బీజేపీ సవరణలపై తీవ్ర సంఘర్షణలో పడిందని సమాచారం.

సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలి: సోనియా

న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుతో సీమాంధ్రలో ఎగిసిన నిరసన జ్వాలను చల్లార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది. ఆంధ్రప్రదేశ్ విభజనతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద సంఖ్యలో నాయకులు పార్టీని వదిలి వెళ్తున్నారు. దీంతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి తలెత్తింది.

ఇది ఇలాగే కొనసాగితే పార్టీ ఉనికి కోల్పోడం ఖాయమని భావించిన అధిష్టానం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని ప్రధాని మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రధాని ఎలా స్పందిస్తారో చూడాలి.

మరోవైపు తమ పార్టీలో విలీనానికి ఆమోయోగ్యమైన అవకాశాలు టీఆర్ ఎస్ కు తెరిచే ఉన్నాయని కాంగ్రెస్ ప్రకటించింది.

-ఆర్ఎస్

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles