Rahul gandhi fires on cm jayalalitha s decision

Rahul Gandhi, Jayalalitha, cm jayalalitha, Rahul Gandhi fires on Jayalalitha, congress party, ex pm rajiv gandhi, sonia gandhi.

Rahul Gandhi fires on Jayalalitha decision

రాహుల్ గాంధీ కి కోపం తెప్పించిన జయలలిత

Posted: 02/20/2014 09:52 AM IST
Rahul gandhi fires on cm jayalalitha s decision

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు  రాహుల్ గాంధీ  తమిళనాడు ముఖ్యమంత్రి  జయలలిత పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.   జయలలిత తీసుకున్న నిర్ణయమే ఆయన లో ఆగ్రహం తెప్పించింది.  రాజీవ్‌ హంతకుల విడుదలకు జయ సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంపై  రాహుల్ గాంధీ మండిపడ్డారు.

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకుల ఉరిశిక్షను సుప్రీంకోర్టు యావజ్జీవిత శిక్షగా మార్చింది. అయితే ఇప్పటికే వీళ్లు 23 ఏళ్లుగా జైల్లోనే మగ్గడంతో, వీరిని విడుదల చేయాలన్న డిమాండ్‌ తమిళనాడులో గట్టిగా వినిపించింది. దీనితో వీరిని విడుదల చేయాలని జయలలిత సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిపై రాహుల్ స్పందించారు. 

ప్రధానిగా పనిచేసిన వ్యక్తులనే చంపివేస్తే సామాన్య పౌరులకు న్యాయం ఎలా ఆశిస్తామని ప్రశ్నించారు. మరణశిక్షకు తాము వ్యతిరేకమని, అయితే ప్రధానిని చంపిన వారు ఇలా కూడా స్వేచ్ఛను పొందవచ్చా ? అని ప్రశ్నించారు. ఇది ఎన్నికల స్టంట్ అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles