Glasses to identify cancer cells

Glasses to identify cancer cells, super specs to recognize cancer cells, Glasses to identify tumor, second surgery of cancer

Glasses to identify cancer cells, super specs to recognize cancer cells

క్యాన్సర్ ని చూడగలిగే కళ్ళజోడు

Posted: 02/12/2014 12:19 PM IST
Glasses to identify cancer cells

క్యాన్సర్ సోకిన జీవకణాలను గుర్తించగలిగితే కేవలం వాటిని మాత్రం తీసివేసి ఆరోగ్యాన్ని చేకూర్చగల అవకాశం ఉంటుంది.  శక్తివంతమైన భూతద్దాన్ని ఉపయోగించి కూడా కంటితో చూడలేకపోవటం వలన పక్కనున్న జీవకణాలనన్నిటినీ తీసి పరీక్షించవలసి వస్తుంది.  దాని వలన శస్త్ర చికిత్సలో అదనంగా చెయ్యవలసిన పనిపడుతుంటుంది.  పెద్ద సమస్య ఏమిటంటే బాగున్న కణం, క్యాన్సర్ సోకిన కణం కూడా కంటికి ఒకేలా కనిపిస్తాయి. 

ఈ సమస్యను అధిగమించటానికి డాక్టర్ అచిలేఫూ ఒక కళ్ళజోడుని తయారుచేసారు.  దీనికి ఇప్పటివరకు ఏ పేరు పెట్టలేదు కానీ దీన్ని ఉపయోగించి జీవకణాలను గుర్తించి శస్త్ర చికిత్సను సులభం చేసుకున్నారు సర్జన్లు.  దీనివలన డాక్టర్ కీ పేషెంట్ కీ కూడా ప్రయోజనం కలుగుతోంది.  1 ఎమ్ఎమ్ సైజులో అతి చిన్నగా ఉన్న ట్యూమర్ ని కూడా ఈ కళ్ళజోడు సాయంతో కనిపెట్టగలగటం వలన శస్త్ర చికిత్స తర్వాత కూడా ఏమైనా కాన్సర్ కణాలు మిగిలిపోయాయా అనే భయం లేకుండా ఉంటుంది. 

ఇంకా దీనిమీద పరిశోధన చేసి దీన్ని మరింత అభివృద్ధి చెయ్యవలసివున్నా, ప్రస్తుతం దీన్ని వాడుతున్న వాళ్ళంతా దీని వలన ప్రయోజనాన్ని పొందుతున్నారు.  రెండవసారి క్యాన్సర్ ఆపరేషన్ చెయ్యవలసిన అవసరాన్ని ఈ కళ్ళజోడు తగ్గిస్తోంది అంటున్నారు డాక్టర్లు. 

ఈ కళ్ళజోడు వీడియో టెక్నాలజీతో పనిచేస్తుంది.  చేతిలో పట్టుకున్న మాలిక్యులర్ ఏజెంట్ క్యాన్సర్ కణానికి తగిలేసరికి అది వెలుగినట్లుగా కనిపిస్తుంది.  దానితో క్యాన్సర్ కణాన్ని గుర్తించటం సులభమౌతోంది.  ఈ గ్లాసెస్ ని మొదటిసారిగా వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో ఉపయోగించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles