Seemandhra ministers stalled parliament

Seemandhra Ministers stalled parliament, Congress Ministers stall parliament, Seemandhra Telangana MPs disrupt parliament, Railway budget by Kharge, Railway Minister Mallikharjuna Kharge

Seemandhra Ministers stalled parliament, Congress Ministers stall parliament

పార్లమెంటును స్తంభింపజేసిన సీమాంధ్ర మంత్రులు

Posted: 02/12/2014 12:56 PM IST
Seemandhra ministers stalled parliament

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర మంత్రులు మొదటిసారిగా పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు మీద ఆందోళన చేసారు. 

కావూరి సాంబశివరావు, పురంధేశ్వరి, చిరంజీవి, పళ్ళం రాజు స్పీకర్ వెల్ లోకి వెళ్ళి సమైక్యాంధ్ర నినాదాలు చేసారు.  కిశోర్ చంద్ర దేవ్, కృపారాణి కూడా ఆందోళన చేసారు కానీ తమ స్థానంలో ఉండే నినాదాలు చేసారు.

ఈ గందరగోళం మధ్యలోనే రైల్వే మంత్రి మల్లిఖార్జున ఖర్గే రైల్వే బడ్జెట్ ని లోక్ సభలో ప్రవేశపెట్టారు.  అలా ఆందోళనను పట్టించుకోకుండా లోక్ సభలో తమ పని తాము చేసుకుంటూ పోతున్న తీరుని చూసి సీమాంధ్ర మంత్రులు మరింత ఆవేశానికి గురయ్యారు.     

సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్న వారిని చూసి తెలంగాణా ఎంపీలు కూడా తెలంగాణాకు మద్దతుగా నినాదాలు చేసారు దానితో సభలో గందరగోళం ఏర్పడి రైల్వే మంత్రి తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేసారు.  సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు సభలో రాష్ట్ర విభజన బిల్లు ప్రతులను చింపివేసారు.  ఇరు ప్రాంతాల సభ్యుల నినాదాలతో మారుమ్రోగిన లోక్ సభను గందరగోళం మధ్యనే వాయిదా వేసారు స్పీకర్ మీరా కుమార్.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles