Today breaking news in andhraprdesh

today breaking news, ap political news, telangana bill, ap bifurcation.

today breaking news in andhraprdesh

టూ..డే బ్రేకింగ్ న్యూస్.

Posted: 02/08/2014 09:05 PM IST
Today breaking news in andhraprdesh

 * ప్రతీకారం  తీర్చుకోవాలి : లగడపాటి 

కాంగ్రెస్ పార్టీ పై  ప్రతీకారం తీర్చుకోవాలని  విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్  కేంద్ర మంత్రులకు  సూచించారు.   ఎలాగైన  తెలంగాణ బిల్లును అడ్డుకోవాలనే ఉద్దేశంలో.. సీమాంద్ర మంత్రులకు  లగడపాటి ..కబడ్డీ నేర్పిస్తున్నారు.

 ముఖ్యమంత్రిని గుడ్డిగా నమ్మినవారికి న్యాయం చేయాల్సి బాధ్యత కూడా ఆయనపైనే ఉందని లగడపాటి అన్నారు. రాష్ట్రం విడిపోకుండా కిరణ్ ఏం చేసిన ఆయనతోనే ఉంటానని స్పష్టం చేశారు. ఏం చేసి అయినా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని అన్నారు.  ఆదివారం జరగబోయే సమైక్య రన్ లో ప్రజలంతా పాల్గొనే సమైక్యవేడి ఢిల్లీ తాకేలా చేయాలని లగడపాటి పిలుపునిచ్చారు.

 * మా గొంతుకలు కోశారు : పురందేశ్వరి

లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయదలుచుకోలేదని కేంద్ర మంత్రి పురందేశ్వరి స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన విషయంలో మా గొంతుకలు కోశారు... మంటల్లో పడేశారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌కు రాసిన ఒక లేఖలో పురందేశ్వరి ఈ విషయం స్పష్టం చేశారు.

విశాఖపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న తమను సంప్రదించకుండానే విశాఖనుంచి మారమని సూచించడం ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేసినా తాము ఒక్క మాటైనా మాట్లాడలేదని పురందేశ్వరి ఆ లేఖలో వివరించారు.

 * కావూరి ఇంటి పై దాడి..

కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమైక్యవాదులు కావూరి ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.  కుండీలను పగలకొట్టారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది.

 * విశాఖలో హాస్టల్లో అగ్నిప్రమాదం

నగరంలోని ఎమ్ వీపీ కాలనీ ప్రైవేట్ హాస్టల్లో ఈరోజు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు, బట్టలు అగ్నికి ఆహూతైయినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. 

 * అంగుళం కూడా వెనక్కి వెళ్లం

తెలంగాణ అంశంపై భారతీయ జనతా పార్టీ అడుగు కాదు.. ఒక్క అంగుళం కూడా వెనక్కి వెళ్లదని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తమకు ఓట్లు, సీట్లు కాదని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ముఖ్యమని ఆయన చెప్పారు.

బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదన్న విషయాన్ని స్వయంగా దిగ్విజయ్ సింగే చెప్పారని గుర్తుచేశారు. 

 * టీఆర్ఎస్ కొత్త డిమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి సంబంధించి బీజేపీ అనుసరిస్తున్న తీరును టీఆర్ఎస్ తప్పుబట్టింది. తెలంగాణ రాష్ట్రమే కాదు..సీమాంధ్ర అభివృద్ది కూడా ముఖ్యమని ప్రకటించిన బీజేపీపై టీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. టి.బిల్లు విషయంలో బీజేపీ తీరు సరిగా లేదని టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. ఎక్కడి పుట్టిన వారు అక్కడే ఉద్యోగం చేయాలని తాము గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్యాకేజీలు సీమాంధ్రతో పాటు, తెలంగాణ కు కూడా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles