Trs in confusion about merger with congress

trs in confusion about merger with congress, TRS party, TRS President KCR, Sonia Gandhi, Digvijay Singh, Telangana bill, TRS merger

trs in confusion about merger with congress

విలీనం ముందా బిల్లు మీద ఆమోదం ముందా?

Posted: 02/09/2014 09:38 AM IST
Trs in confusion about merger with congress

కప్పు లిప్పు వరకు చేరుకునే ఈమధ్యలో ఏమైనా జరగొచ్చన్నట్లు, రాష్ట్ర విభజన జరుగుతుందా లేదా అంటే ఎవరూ ఏమీ చెప్పలేకుండా ఉన్నారు.  రాజ్య సభలో ఆగిపోవచ్చు, లోక్ సభలో ఆగిపోవచ్చు, రాష్ట్రపతి దగ్గర ఆగిపోవచ్చు, ఎన్నికల వలన ఆగిపోవలసిరావచ్చు, ఇలా ఏమైనా జరగొచ్చు.  కానీ అధిష్టానం తలుచుకుంటే ఎప్పుడైనా ఇవ్వచ్చు అనే సంకేతాలను మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఇచ్చింది.  అంటే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును ఆపాలన్నా ఇవ్వాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర అన్నీ సిద్ధంగానే ఉన్నాయి. 

రాష్ట్ర విభజన బిల్లు మీద పడుతున్న మల్లగుల్లాలను బేఖాతరు చేస్తూ ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అసలిదంతా చేస్తున్నందుకు ఆశించిన వదులుకోదలచుకోలేదు.  అంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో ఆధిపత్యం కావాలి.  కాబట్టి విషయం పూర్తిగా తన చేతుల్లోంచి దాటిపోక ముందే తెలంగాణా రాష్ట్ర సమితి తో ఒప్పందం ప్రకారం విలీనానికి పిలుస్తోంది కాంగ్రెస్ పార్టీ. 

తెలంగాణాతోనే  తిరిగొస్తా, కిరణ్ కుమార్ రాజీనామా చెయ్యటం ఖాయం అని చెప్తూ వెళ్ళిన తెరాస అధ్యక్షుడు కెసిఆర్ కి తన మాట దక్కించుకోవాలంటే, తెలంగాణా సాధించిన ఘనత తన ఖాతాలో చేరాలంటే ప్రస్తుత పరిస్థితులలో విలీనం కాక తప్పదనే సంకేతాలనిస్తూ అందుకు అనుగుణమైన వాతావరణాన్ని కల్పించిన కాంగ్రెస్ పార్టీ శనివారం సాయంత్రం కెసిఆర్ తో విలీనం మీద చర్చ మొదలుపెట్టింది

అందిన సమాచారం ప్రకారం, విలీనానికి సిద్ధమేనన్న కెసిఆర్ కొన్ని సందేహాలను లేవనెత్తారు.  విభజనకు వ్యతిరేకంగా ఇంత ఆందోళన ఉన్నప్పుడు విభజన ఎలా జరుగుతుందని నమ్మమంటారు అని కెసిఆర్ ప్రశ్నించారు.  విభజనను ఆపటం ఎవరి తరమూ కాదు అని పైకి చెప్తున్నా ఏమో ఎప్పుడైనా ఆగిపోవచ్చనే సందేహం కెసిఆర్ కి కలిగిందంటే కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో వాతావరణాన్ని అల్లిందో అర్థం చేసుకోవచ్చు.  అవన్నీ మేము చూసుకుంటాం విలీనం చేస్తే తెలంగాణా తీసుకువచ్చే పూచీ మాది అని దిగ్విజయ్ సింగ్ అన్నట్లుగా తెలుస్తోంది.

బిల్లు ఆమోదం పొందేంతవరకూ ఆగాలని తెరాస చూస్తోంది.  ఎందుకంటే విలీనం అయిన తర్వాత విభజన కాకపోతే ఎటూ కాకుండా పోతుంది వ్యవహారం. అలాగని జాప్యం చేస్తే తమకు ప్రయోజనం లేదని అనుకున్న క్షణమే కాంగ్రెస్ పార్టీ విభజన ప్రక్రియను ఊరగాయ జాడిలో వేసి మూత పెట్టేసే ప్రమాదమూ ఉంది కాబట్టి తెరాసా నాయకులు దీని మీద తర్జనభర్జనలు పడుతున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles