Namo tea stall at 2002 hit area

NaMo tea stall at 2002 hit area, Narendra Modi BJP, BJP Prime Ministerial candidate, NaMo tea stall at Naroda Patia, 2002 Gujarat riots

NaMo tea stall at 2002 hit area, Narendra Modi BJP, BJP Prime Ministerial candidate

గుజరాత్ లో అల్లర్లు జరిగినచోట నమో టీ స్టాల్

Posted: 02/07/2014 04:40 PM IST
Namo tea stall at 2002 hit area

తన ప్రతిష్టకు మచ్చ తెచ్చే ప్రయత్నంలో గుజరాత్ లోని 2002 అల్లర్లతో తన పేరుని ముడిపెట్టే వైరి పక్షాల ప్రయత్నాలలోంచి నెమ్మది నెమ్మదిగా బయటపడుతున్న భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ ప్రాంతాలలో ప్రారంభిస్తున్న టీ దుకాణాలలో ఒకటి ఆ అల్లర్లలో బాగా నష్టపోయిన ప్రాంతమైన నరోడా పాటియా లో ప్రారంభించటం విశేషం.  

అందునా, ఆ టీస్టాల్ యజమాని జుబైర్ షేక్ కావటం, అంతకు ముందు దాని పేరు అంతకు ముందు బెస్ట్ టీ స్టాల్ గా నడుస్తున్న ఆ దుకాణం ఇప్పుడు నమో టీ స్టాల్ గా మారటం మరీ విశేషం.  

చాయ్ పే చర్చా కార్యక్రమంలో భాగంగా చిన్నప్పుడు రైళ్ళల్లో టీ గ్లాసులను అందించే పని చేసిన నరేంద్ర మోదీ అందుకు గుర్తుగా, తానింకా సామాన్యుడననే భావన కలుగజేస్తూ టీ దుకాణాలను తెరిపిస్తున్నారు.  వాటన్నిటిలోకీ జుబైర్ షేక్ టీ దుకాణం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.  

ఫిబ్రవరి 28, 2002 లో ఈ టీ దుకాణానికి మూడు కిలోమీటర్ల దూరంలో 10 గంటల సేపు జరిగిన మానవసంహారంలో 97 మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు.  ఈ టీ దుకాణానికి సమీపంలో కూడా హింసాకాండ జరిగింది.  

పాత సంఘటనలను ఎంతకాలం గుర్తుంటుకుంటాం.  తాజాగా రాబోయే రోజులను గడుపుదాం.  అంటున్నారు టీ స్టాల్ యజమాని జుబైర్ షేక్.  పైగా ఇది తన స్టాల్ కి మంచి గుర్తింపుని తెచ్చి వ్యాపారాన్ని కూడా పెంచుతుందంటున్నారాయన.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles