Us nri daughter shot dead by mother

US NRI daughter shot dead by mother, Chetana Guduru, Sujata Guduru, Chetana Guduru shot dead

US NRI daughter Chetana Guduru shot dead by mother Sujata Guduru

అమెరికాలో ప్రవాసాంధ్ర తల్లి కూతుళ్ళ దారుణం

Posted: 01/29/2014 06:31 PM IST
Us nri daughter shot dead by mother

అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ లో ఓవిడోలో తుపాకీ గుండు వలన మరణించిన చేతనా గూడూరు పక్కనే సుజాత గూడూరు గుండు దెబ్బతిని అచేతన స్థితిలో కనిపించారు.

17 సంవత్సరాల చేతనా గూడూరు క్లాస్ లో అందరినీ అబ్బురపరచే విద్యార్థిని.  ఎప్పుడూ చదువు తప్ప వేరే ధ్యాస లేని బుద్ధిమంతురాలు.  ఏ ప్రశ్న అడిగినా వెంటనే సమాధానం చెప్పగల సమర్దురాలు.  ఆమె చదువుతున్న సెమినోల్ హైస్కూల్ లో సీనియర్ విద్యార్థులంతా ఈ వార్త విని దిగ్భ్రాంతి చెందటమే కాకుండా మనస్తాపం మానసిక అలజడి కలిగి ఒకరినొకరు పట్టుకుని రోదించారు.  ఈ దుర్ఘటన చెవిలో పడిన తర్వాత తరగతి కూర్చుని పాఠాల మీద ధ్యాస పెట్టలేకుండా ఉన్నామంటున్నారు తోటి విద్యార్థులు.

ఓర్లాండో రీజినల్ మెడికల్ హాస్పిటల్ లో చేర్చిన 44 సంవత్సరాల సుజాత గూడూరు పిస్టల్ తో కూతురిని కాల్చి తరువాత తనను తాను గుండెల మీద కాల్చుకున్నారు.  ఆమె ఎప్పుడు కోలుకున్నా సరే ఆమె మీద ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు ఉంటుందంటున్నారు ఓవిడో పోలీసు అధికారులు. 

వేవర్లీ వుడ్స్ సబ్ డివిజన్ లో ఫార్మింగమ్ కోర్టు నివాసంలో వాళ్ళిద్దరినీ చూసిన సుజాత గూడూరు సోదరుడు ప్రసాద్ చిత్తలూరుకి ఆ రోజు ఉదయం సుజాత గూడూరు నుంచి వచ్చిన ఇమెయిల్ ను చూసి అక్కడికి చేరుకున్నారు.  ఆ ఇమెయిల్ లో తను హత్య, ఆత్మహత్య చేయనున్నట్లు తెలియజేసారామె.  వాళ్ళిద్దరినీ ఆ పరిస్థితిలో చూసి పోలీస్ ఎమర్జెన్సీకి కాల్ చేసారు ప్రసాద్ చిత్తలూరు. 

తన తర్వాత తన కూతురు ఎలా బ్రతుకుతుంది అనే వేదనతోనే ఆమె ముందుగా చేతన గూడూరు ని తుపాకి తో కాల్చి చంపారని తెలిసింది కానీ ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి గల కారణాలు తెలియటం లేదన్నారు పోలీసులు.  అయితే ఈ ఘటన అప్పటికప్పుడు అనుకోకుండా జరిగింది కాదు.  ఆమె జనవరి 21నే .38 కాలిబర్ పిస్టల్ ని కొనిపెట్టుకోవటం జరిగింది.  అందువలన ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డరని పోలీసులు అంటున్నారు.  దుర్ఘటన జరిగినప్పుడు సుజాత భర్త రావు గూడూరు ఊళ్ళో లేరు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles