Nc and ncp ready to forget 2002 riots

NC and NCP ready to forget 2002 riots, Gujarat 2002 riots, Clean Chit to Modi from Courts, National Congress Party, Omar Abdulla, Faruq Abdulla, Praful Patel

NC and NCP ready to forget Gujarat 2002 riots

కాంగ్రెస్ ప్రభుత్వానికి మిత్ర పక్షాలిచ్చిన షాక్

Posted: 01/29/2014 05:52 PM IST
Nc and ncp ready to forget 2002 riots

కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాలైన జమ్ము కాశ్మీర్ నేషనల్ కాంగ్రెస్, మహారాష్ట్రా నేషనల్ కాంగ్రెస్ పార్టీలు అధికార పక్షమైన జాతీయ కాంగ్రెస్ పార్టీని దిగ్భ్రాంతికి గురిచెయ్యటమే కాకుండా 2014 ఎన్నికలలో విజయం ప్రశ్నార్థకం చేస్తోంది.

మాటిమాటికీ గుజరాత్ అల్లర్ల ఊసెత్తుతూ నరేంద్ర మోదీని విమర్శిస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఆ రెండు పార్టీలూ ఇక ఆ వూసెత్తద్దని చెప్పేసాయి.  నరేంద్రమోదీ ప్రధాన మంత్రి అవుతారో లేదో అదంతా ఓటర్ల చేతిలో ఉంది కానీ 2002 అల్లర్లను ఇక పక్కకు పెట్టేయమంటూ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాంగ్రెస్ నాయకుడు ఫారూఖ్ అబ్దుల్లా, మహరాష్ట్ర నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రఫుల్ పటేల్ తెగేసి చెప్పేసారు. 

మనం ఇప్పుడు న్యాయస్థానాలు న్యాయనిర్ణయం చేసే రోజుల్లో ఉన్నాం.  న్యాయస్థానాలు తీర్పులనిస్తాయి, వాటిని మనం గౌరవించాలి.  ఒకసారి కోర్టు నుంచి ఆ నేరారోపణలనుంచి విముక్తులయిన తర్వాత పదేపదే అదే విషయాన్ని పట్టుకుని కూర్చోవటం సరైనది కాదని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ మీది కేసు గురించి వాళ్ళిద్దరూ నాయకులూ అన్నారు. 

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా తమ పార్టీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు లేకుండా పోటీ చేస్తుందని మంగళ వారం నాడు స్పష్టంగా చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీకి ఇతర మిత్ర పక్షాలు కూడా తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారయ్యాయి.  దీనితో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అంచనాల్లోనూ వ్యూహ రచనల్లోనూ మార్పులు వస్తున్నాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles