Volvo bus fire accidents

volvo bus fire accidents, Volvo bus fire 45 dead, Volvo bus Palem accident, Volvo Bus Co, volvo bus fire accident averted

volvo bus fire accidents

వోల్వో బస్సు వద్దు వద్దు

Posted: 01/24/2014 05:01 PM IST
Volvo bus fire accidents

వోల్వో బస్సులలో అగ్ని ప్రమాదం జరిగి 45 మంది ఆనవాలు పట్టలేనంతగా కాలి చనిపోయిన తర్వాత అడప దడపా వోల్వో బస్సులలో మంటలు రావటం విన్నప్పుడల్లా ఆ బస్సులలో ప్రయాణం చెయ్యాలంటే భయం కలుగుతోందంటున్నారు ప్రయాణీకులు. 

పశ్చిమ బెంగాల్ హుగ్లీలో డంకునీ సమీపంలో వోల్వో బస్సులో మంటలు వ్యాపించగా అప్రమత్తమైన డ్రైవర్ బస్సుని నిలిపి అందులోని 38 మంది ప్రయాణీకులను సురక్షితంగా కిందికి దించటం జరిగింది.

బెంగళూరు హైద్రాబాద్ వోల్వో బస్సు మహబూబ్ నగర్ జిల్లా పాలం లో అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు వోల్వో కంపెనీ నుంచి నిపుణులను పిలిపిస్తామని చెప్పారు కానీ ఆ దిశగా ఎటువంటి అడుగులూ పడలేదింతవరకూ.  వోల్వో బస్సులలో డ్రైవింగ్ లో ఉన్న సునాయాసం కూడా వేగంగా పోవటానికి సహకరిస్తోంది.  అతి వేగంగా పోయినప్పుడు ఇంజన్ వేడెక్కి ఏమాత్రం షార్ట్ సర్క్యూట్ అయినా మంటలు చెలరేగే ప్రమాదం ఉంది.  కానీ వోల్వో కంపెనీ ప్రతినిధులు ఈ విషయంలో ఇంతవరకూ ఏమీ చెప్పలేదు, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో సూచించలేదు, వాళ్ళ భావి బస్ నిర్మాణంలో అలా జరగకుండా ఏమి చెయ్యబోతున్నారన్నది కూడా వెల్లడి చెయ్యలేదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles