Modi words copied by rahul gandhi

Modi words copied by Rahul Gandhi, Congress Vice President

Modi words copied by Rahul Gandhi

మోదీ మాటలను కాపీ కొట్టిన రాహుల్?

Posted: 01/24/2014 03:12 PM IST
Modi words copied by rahul gandhi

నేను కాదు మనం (మై నహీఁ హమ్) అనే మాటలను భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ గుజరాత్ ముక్యమంత్రిగా పడిగట్టు మాటలైతే, అవే మాటలను కాంగ్రెస్ తరఫునుంచి వార్తా పత్రికలలో రాహుల్ ఫోటోని ప్రముఖంగా పెట్టి తయారు చేసిన ప్రకటనలో వాడటం జరిగింది. 

వెంటనే భాజపా అవి మోదీ మాటలలోంచి కాపీ కొట్టిన మాటలంటూ మోదీ తో పాటు ఆయన వెనక అవే మాటలు రాసివున్న ఫొటోని విడుదల చేసారు.  ఈ రెండూ ఇప్పుడు మీడియాలో బాక్టీరియాలా శీఘ్రగతిలో వ్యాపిస్తున్నాయి. 

కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి ప్రకటనలిచ్చేవాళ్ళు ఈ తప్పునెలా చేసారా అని కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.  మనది ఒకే సమాజం, ఒకే దృష్టికోణం- గుజరాత్ సమాజం- నేను కాదు మనం అని గోడ ప్రకటన ముందు మోదీ నిల్చున్న ప్రసంగిస్తున్న ఫొటో ఇప్పుడు కాంగ్రెస్ ప్రకటనను వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. 

నేను కాదు మనం- నాదగ్గరేమీ మంత్ర దండం లేదు దాన్ని తిప్పి ప్రగతిని సాధించేట్టు చెయ్యటానికి.  మనందరం కలిసి చేతులు కలిపి ప్రగతిని సాధిద్దాం.  ప్రతి ఒక్కరి చేతిలోనూ శక్తి ఉంది.  కాబట్టి అందరం కలిసి సాధిద్దామంటూ వచ్చింది రాహుల్ గాంధీని ప్రస్ఫుటంగా చూపిస్తూ సాగిన నినాదాలు.  ఎక్కడో తప్పు జరిగింది.  వేరేవాళ్ళని కాపీ కొట్టాల్సిన అవసరం మాకు లేదు అంటోంది కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ ముఖం ఎర్రబారటానికి మరో కారణం, ఆ ప్రకటనలో కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఫొటో ఉంది కానీ, ప్రెసిడెంటైన సోనియా గాంధీ ఫొటో కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాన మంత్రైన మన్మోహన్ సింగ్ ఫొటో కానీ లేదు.  అంత ఖంగారు ఖంగారుగా ఎవరినీ సంప్రదించకుండా అటువంటి పార్టీ ప్రకటన ఎందుకు ఇవ్వవలసివచ్చిందో, దానికి అసలు కారకులెవరో కాంగ్రెస్ పార్టీ బయటపెట్టటం లేదు.   

ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏమీ అనలేదు కానీ, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చెప్పిన మాటలు కూడా అవే- తన దగ్గర మంత్రదండమేమీ లేదని, ప్రజలంతా కలిసి చేస్తేనే ప్రగతి, అవినీతి నిర్మూలన జరుగుతుందని చెప్పటం జరిగింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles