Us study says modi going to win 2014 elections

US Study says Modi going to win 2014 elections, Narendra Modi, US study on Indian

US Study says Modi going to win 2014 elections

మోదీకి 2014 ఎన్నికల్లో గెలుపు ఖాయం- యుఎస్ స్కాలర్ అధ్యయనం

Posted: 01/09/2014 11:37 AM IST
Us study says modi going to win 2014 elections

అమెరికన్ వర్జీనియా విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ జాన్ ఎకేవెరీ జెంట్ చేసిన అధ్యయనం ప్రకారం భారత్ లో 2014 సాధారణ ఎన్నికల్లో భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడి చేసారు.  దీనిమీద పేపర్ ని , ది ఎకానమీ, బిజినెస్ అండ్ ఇండియాస్ 2014 పార్లమెంటరీ ఎలక్షన్స్ అనే శీర్షికతో విశ్వవిద్యాలయం త్వరలో విడుదల చెయ్యనుంది. 

అందులో ఇంకా, భారత్ లో ఎన్నికలలో అభ్యర్థులు, పార్టీలు చేసే ఖర్చుల గురించిన చర్చ కూడా ఉంది.  దానితోపాటు 2014 ఎన్నికల దృష్ట్యా ప్రస్తుతం బరిలో ఉన్న నాయకుల బలాబలాలు కూడా తెలియజేయటం జరుగుతోంది. 

ప్రొఫెసర్ జెంట్ చేసిన అధ్యయనంలో ఆయన అంచనా ప్రకారం 2014 లో భాజపా నేతృత్వంలో నడిచే ఎన్డీయే అధికారంలోకి వస్తుంది.  భాజపాలో చురుగ్గా పనిచేస్తున్న మోదీ వోటర్లను ఆకర్షించటం, వివిధ నాయకులను కూడగట్టుకోవటం చేస్తున్నారని, ఆ  విషయంలో ఆయన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకంటే ఎక్కువ చతురత, సామర్ధ్యం గలవారని ప్రొఫెసర్ నిర్ధారించారు.   అంతేకాదు అమెరికన్ ప్రభుత్వం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీకి వీసా ఇచ్చే నిర్ణయం తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.  లేకపోతే మోదీ ప్రధాన మంత్రి అయిన తర్వాత ఎలాగూ ఆ పని చెయ్యక తప్పదన్నారాయన.  గుజరాత్ లో జరిగిన అల్లర్ల మచ్చ ఆయన మీద ఉన్న మాట నిజమే కానీ, ప్రజలు ఆయనకు పట్టం కట్టటంతో అది మాసిపోతుందని అన్నారాయన. 

భారతదేశం మీద అధ్యయనం చేసే అమెరికన్ విద్యా సంస్థతో అనుబంధం గల ప్రొఫెసర్ జెంట్ ఢిల్లీలో కాంగ్రెస్ పరాజయం, ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు పట్టం కట్టటమనేది చూస్తే కాంగ్రెస్ పార్టీ బలహీనమైపోయిందని తెలుస్తోందని వెల్లడించారు.  అయితే ఆమ్ ఆద్మీ పార్టీ విజయం కేవలం ఢిల్లీకే పరిమితమని కేజ్రీవాల్ క్రేజ్ తాత్కాలికమని కూడా ప్రొఫెసర్ తన అధ్యయనం చేసి రాసిన పేపర్ లో తెలియజేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles