Aap helpline

AAP helpline from thursday, AAP helpline fight corruption, Arvind Kejriwal, Delhi Chief Minister Kejriwal

AAP helpline from Thursday

ఓట్లు కురిపించే ఆప్ హెల్ప్ లైన్?

Posted: 01/09/2014 09:52 AM IST
Aap helpline

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలం విడుదల చేసిన హెల్ప్ లైన్ 040-27357169 అవినీతికోరుల గుండెల్లో గుబులు రేపుతుందని అన్నారు.  ఢిల్లీ ప్రజలంతా ఇప్పుడు అవినీతికి వ్యతిరేకంగా పనిచేసే ఇన్స్ పెక్టర్లేనన్నారాయన.  

ఈరోజు ఉదయం 8.00 గంటలకు మొదలైన ఈ హెల్ప్ లైన్ రాత్రి పది గంటల వరకు పనిచేస్తుంది.  ఈ సమయాన్ని ప్రతిరోజూ పాటించటం జరుగుతుందని తెలియజేసారు కేజ్రీవాల్.  ఇంకా సులభంగా గుర్తుపెట్టుకోవటం కోసం నాలుగు సంఖ్యలతో కూడిన హెల్ప్ లైన్ నంబర్ ని ప్రాసెస్ చేస్తున్నామన్నారాయన.  

అవినీతి పట్ల పౌరులకున్న ఆగ్రహావేశాలను ఓటుబ్యాంక్ గా మార్చుకుంటున్నారని ప్రతిపక్షాలు బుగ్గలు నొక్కుకుంటున్నా, మంచి పని ఎప్పుడు మొదలుపెట్టినా మంచిదే కదా అనేవారూ ఉన్నారు.  

ఏమైనా కేజ్రీవాల్ దగ్గర రాజకీయ నాయకులు నేర్చుకోవలసింది చాలా ఉంది.  అలుపెరగకుండా జనాకర్షక విధానాల ద్వారా ఢిల్లీలో స్థానాన్ని సంపాదించిన ఆప్ పార్టీ ఇప్పుడు దేశ రాజకీయాల మీదకు దృష్టి సారించి అందుకు కావలసిన కసరత్తులు చేస్తోంది.  వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఆ పార్టీకి వస్తున్న క్రేజ్ అందుకు నిదర్శనం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles