Protests mar assembly functioning

protests mar AP Assembly functioning, AP Assembly continuous adjournments, Telangana Bill, Unruly Assembly, non-parliamentary,

protests mar assembly functioning

కొనసాగుతున్న ఆందోళన, సాగని శాసనసభ

Posted: 01/07/2014 03:51 PM IST
Protests mar assembly functioning

శాసన సభ రేపటికి వాయిదా పడింది.  సమస్యను పరిష్కరించుకోవాలి కానీ వాయిదా వెయ్యటం సరైన పద్ధతి కాదని ప్రజాప్రతినిధులకు తెలియదని కాదు కానీ, పబ్బం గడుపుకోవటమే లక్ష్యంగా సాగినప్పుడు అలాగే జరుగుతుంది.  ఈరోజుకి అయిపోయింది, రేపటి సంగతి రేపు చూసుకుందాం అనే ఆలోచన వలనే ప్రగతి కుంటుపడుతోంది. 

శాంతించండి, సహకరించండి, మీమీ సీట్లలో కూర్చోండి అంటూ సభాపతి, ఉపసభాపతుల అభ్యర్ధనను లెక్క చెయ్యకుండా ఆందోళన సాగిస్తున్నవారు రాష్ట్రంలో ఇరు ప్రాంతాల ప్రజాప్రతినిధులూ ఉన్నారు.  తెలంగాణా కోరుకునేవారు సహకరించటంలేదు, వద్దనేవారూ చర్చల ద్వారా పరిష్కరిద్దామనుకోవటంలేదు. 

శాసన సభ రేపటికి వాయిదా పడింది.  ఈ రోజుకి ముగిసింది.  కానీ రేపు కూడా ఇదే సన్నివేశం పునరావృతం కాదనే హామీ ఏమైనా ఉందా.  దీనికి పరిష్కారమేమిటి.  రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు ఆ ప్రజలకు ఎలాంటి సంకేతాలిస్తున్నారు.

మర్యాదగా ప్రవర్తించటం, మర్యాదగా మాట్లాడటం హుందాగా నడుచుకోవటం లాంటి లక్షణాలను చట్ట సభలలో చూసి నేర్చుకోవాలనుకునేవారు ఒకప్పుడు.  అందుకే బహిరంగంగా అనకూడని మాటలన్నప్పుడు నాన్ లేక అన్ పార్లమెంటరీ అనే వాడుక వచ్చింది.  అంటే ఇప్పుడు ఎలా ప్రవర్తించగూడదో మనకు శాసన సభ్యులు తెలియజేస్తున్నారు.  ఇది చేపల బజారు కాదు అనేవారు ఒకప్పుడు అలా గందరగోళంగా మాట్లాడుతుంటే.  ఇప్పుడు అలా చేసేవాళ్ళని బయట, ఇది పార్లమెంటు కాదు లేక శాసన సభ కాదు సరిగ్గా ఉండండి అనే వాడుక వచ్చేట్టుంది. 

సాగవలసిన శాసనసభ సాగటంలేదు, అగని ఆందోళన శాసన సభలో కొనసాగుతోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles