Naidu requests pranab halt ap bifurcation

Andhra Pradesh, bifurcation, Chandrababu Naidu, Congress, Hyderabad, Pranab Mukherjee, TDP, Telangana, Telugu Desam Party.

Telugu Desam Party (TDP) president N Chandrababu Naidu on Thursday requested President Pranab Mukherjee to halt the proposed bifurcation of Andhra Pradesh.

బాబు... రాష్ట్రపతిని కలిసి పాతపాటే పాడారు

Posted: 12/27/2013 08:00 AM IST
Naidu requests pranab halt ap bifurcation

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శీతాకాల విడిదికోసం వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని రాత్రి బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి ముందు పాత పాటే పాడారు. రాష్ట్ర విభజనలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయని, అందరికీ న్యాయం జరగాలని, ఇరు ప్రాంతాల వారితో చర్చించి ఆమోదయోగ్యమైన పరిష్కారం చేసే విధంగా రాష్ట్రపతిని కోరినట్లు బాబు వివరించారు.

తెలుగు ప్రజలను రాజకీయ లబ్ధికోసం విడదీస్తున్న వ్యవహారంలో మొదటి ముద్దాయి సోనియాగాంధీయేనని, సీట్ల కోసమే ఈ విభజనను చేపడుతున్నారన్నారు. ఆర్టికల్ 3ను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని, రు ప్రాంతాల సమస్యలకు పరిష్కారం చూపకుండా విడదీస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని బాబు విమర్శించారు.

రాష్ట్ర విభజన విధ్వంసానికి కాంగ్రెస్, టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్ సీపీలే కారణమన్నారు. మరి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన బాబు ఇలా మాట్లాడటం సరికాదని అంటున్నారు టీఆర్ఎస్, వైసీపీ నేతలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles