Ahmedabad court gives modi a clean chit

Ahmedabad court, clean chit, narendra modi, ahmedabad, riots, court, gujarat, sit,Gulbarg Society, BJP, Narendra Modi, Zakia Jafri

Narendra Modi got a huge relief on Thursday after a metropolitan court here rejected

మోడీకి క్లీన్ చిట్ ఇచ్చిన కోర్టు

Posted: 12/26/2013 07:28 PM IST
Ahmedabad court gives modi a clean chit

భారతీయ జనతాపార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి 2002లో గుల్బర్గలో జరిగిన మత ఘర్షణకు సంబంధించిన కేసులో అహ్మదాబాద్ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ అల్లర్లలో మరణించిన మాజీ ఎంపీ ఎహసాన్ భార్య జుకిమా జాఫ్రీ తన భర్త మరణానికి నరేంద్ర మోడీనే కారణం అని, అతని పై క్రిమినల్ కేసు పెట్టాలని, మోదీ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే మత హింస చెలరేగిందని, ఆ అల్లర్లలో తన భర్త మరణించాడని దీని పై విచారణ చేపట్టాలని ఫిర్యాదు చేసింది.

ఈ కేసు పై విచారణ చేయాల్సిందిగా సిట్ కు ఆదేశించింది. దీని పై విచారణ చేసిన సిట్ మోదీ అల్లర్లకు కారణం అయినట్లుగా ఎక్కడా ఆధారాలు దొరకలేని కారణంగా కేసును కొట్టివేయాలని చెప్పింది. సిట్ ఇచ్చిన నివేదికను అహ్మదాబాద్ కోర్టు సమర్థిస్తూ, బాధితురాలు జాకియా జాఫ్రీ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పు పై జాకియా జాఫ్రీ స్పందిస్తూ... తన భర్త మరణానికి కారణం అయిన అల్లర్ల కేసులో న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని, అహ్మదాబాద్ కోర్టు తీర్పు పై హైకోర్టులో పిల్ వేస్తానని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles