Harish rao warns seemandhra political parties

harish rao warns mlas, telangana draft bill, t-bill, harish rao fire on mlas, assembly media point, t-bill in assembly, harishrao fire on cm kiran, harish rao warns seemandhra political parties, harish rao asks seemandhra mlas, telangana bill, harish rao warned seemandhra mlas, rs senior leader t harish rao, seemandhra all parties, political news, latest telugu news, breaking news, headlines

harish rao warns seemandhra political parties

హరిష్ రావు హెచ్చరిక.. సభను వాయిదా వేస్తే ఊరుకోం?

Posted: 12/18/2013 12:48 PM IST
Harish rao warns seemandhra political parties

తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చను అడ్డుకునే సభ్యులను సస్పెండ్ చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు డిమాండ్ చేశారు. ఆయన ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ చర్చ సమయంలో అన్ని ప్రాంతాలవారు తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చన్నారు. జనవరి 23 వరకూ శాసనసభ సమావేశాలు జరుగుతుందనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం కావాలనే లీకులు చేస్తోందని హరీష్రావు మండిపడ్డారు. బిల్లుపై తక్షణమే చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

 

వాయిదాలతో శాసనసభ నడపటం అప్రజాస్వామికమని హరీష్‌రావు అన్నారు. టీడీపీ డబుల్ గేమ్ ఆడటం సరైందికాదన్నారు. బీహార్‌, యూపీ, మధ్యప్రదేశ్ లో విభజన బిల్లుపై రెండ్రోజుల్లోనే చర్చ ముగించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించడానికి 42 రోజులు అవసరమా అని ప్రశ్నించారు. నెలాఖరులోగా చర్చ పూర్తిచేసి బిల్లు రాష్ట్రపతికి పంపాలని డిమాండ్ చేశారు.బిల్లుపై చర్చ పూర్తిచేయించే బాధ్యత తెలంగాణ మంత్రులదే అన్నారు.

 

బిల్లుపై చర్చ జరగనీయకుండా సభను వాయిదా వేస్తే ఊరుకోబోమని హరీష్ రావు హెచ్చరించారు. బిల్లులో తమకు కూడా కొన్ని అభ్యంతరాలున్నాయని తెలిపారు. వాయిదాలు వేసి తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని కోరారు. స్పీకర్ ఒత్తిడికి గురికావొద్దని సూచించారు. చర్చను అడ్డుకునే సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలను ఆయ పార్టీల నాయకులు కట్టడి చేసుకోవాలన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles