Anna hazare to end fast after lok sabha passes lokpal bill

lokpal bill, lok sabha passes lokpal bill, anna hazare, lokpal bill, rajya sabha passes lokpal bill, anna hazare to end fast after lok sabha passes lokpal bill, arvind kejriwal, anna hazare, aam aadmi party, political news, latest telugu news, breaking news, headlines

Anna Hazare to end fast after Lok Sabha passes Lokpal Bill

లోక్‌పాల్‌ ఆమోదం-అన్నా దీక్ష విరమణ

Posted: 12/18/2013 11:13 AM IST
Anna hazare to end fast after lok sabha passes lokpal bill

చారిత్రక లోక్‌పాల్‌ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. దీంతో అవినీతిని రూపుమాపేందుకు గత 45 ఏళ్లుగా సాగుతున్న సుదీర్ఘ పోరాటంలో ఇదొక ముందడుగుగా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. లోక్‌పాల్‌ బిల్లుపై రాజకీయ పార్టీలు సూచించిన సవరణలపై రాజ్యసభ ఛైర్మన్‌ హమిద్‌ అన్సారీ అంతకుముందు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగుతుంది. కాగా లోక్‌పాల్‌ బిల్లు కోసం నిరశన దీక్షలో వున్న సామాజిక కార్యకర్త అన్నా హజారే బిల్లు ఆమోదం పట్ల హర్షం ప్రకటిం చారు. బిల్లును ఆమోదించినందుకు ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. లోక్‌సభలో ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడగానే తాను దీక్ష విరమిస్తానని ప్రకటించారు. 2011 డిసెం బరులో సభలో ఆమోదం పొందలేకపోయిన లోక్‌పాల్‌, లోకాయుక్త బిల్లు, 2011ను తిరిగి పార్లమెంటరీ సెలక్ట్‌ కమిటీకి నివేదించారు

 

 

అయతే వచ్చే మే నెలలో జరిగే సాధారణ ఎన్నికల్లో కీలక పరీక్షగా ఉన్న అవినీతి వ్యతిరేక ఉద్యమం ఆధారంగా ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మట్టికరిపించిన ఆమ్‌ఆద్మీపార్టీ, ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ విజయంతో ఈ బిల్లుకు ఎక్కడలేని మద్దతు వచ్చింది. కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌ను మూడో స్థానానికి నెట్టేశారు. ఢిల్లీ లో బీజేపీకి మెజారిటీ రాకుండా చేశారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో జాతీయ పార్టీల విజయావకాశాలను దెబ్బ తీసే శక్తి ఉందని కేజ్రీవాల్‌ నిరూపించారు. మురికి రాజకీయాలను శుభ్రం చేస్తాననే వాగ్ధానంతో కేజ్రీవాల్‌ ప్రచారం నిర్వహిం చారు.

 

2011లో ఈ బిల్లు కోసం పోరాడిన క్షేత్రస్థాయి సభ్యుడు కేజ్రీవాల్‌. దేశవ్యాప్తంగా అన్నా హజారే నేతృత్వంలో జరిగిన అవినీతి వ్యతిరేక పోరాటంలో వెల్లడైన ప్రజాగ్రహాన్ని కాంగ్రెస్‌ గుర్తించలేకపోయింది. ఈ బిల్లు ఆమోదం కోసం అన్నా హజారే చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష మంగళవారానికి ఎనిమిదో రోజుకు చేరింది. ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని 2011లో పన్నెండు రోజుల ఆమరణ దీక్ష చేసి ఆయన విజయం సాధించారు. లోక్‌పాల్‌బిల్లు పాస్‌ కావడం పెద్ద ముందడగని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles