No scope of pakistan winning a war in my lifetime pm

No scope of Pakistan winning a war in my lifetime: PM, Pakistani PM Nawaz Sharif, Indian Prime Minister Manmohan Singh

No scope of Pakistan winning a war in my lifetime: PM

నేను బతికుండగా పాక్‌ గెలవలేదు!

Posted: 12/05/2013 09:14 AM IST
No scope of pakistan winning a war in my lifetime pm

పాకిస్థాన్ కవ్వింపు చర్యలు పాల్పడుతున్న విషయం తెలిసిందే. అయితే మరో అడుగు ముందుకేసి, త్వరలో భారత పై అణుయుద్దం చెయ్యాల్సిన అవసరం ఉందని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరిఫ్ అన్నారు. అదీ కూడా కాశ్మీర్ కోసమే చేయ్యాల్సి వస్తుందని చెప్పినట్లు పాకిస్థాన్ పత్రిక ప్రకటించింది. ఈ విషయం ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సీరియస్ గా స్పందించారు. నా జీవిత కాలంలో పాకిస్థాన్‌ అలాంటి ఏ యుద్ధం లోనూ గెలిచే అవకాశమే లేద'ని కుండబద్దలు కొట్టారు.

 

పాకిస్థాన్‌ దినపత్రికలో వచ్చిన ఓ వార్త తాజా వివాదానికి కారణమైంది. పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ మాట్లాడుతూ 'ఏసమయంలోనైనా అణ్వాయుధ దేశాలైన భారత్‌, పాకిస్థాన్‌ మధ్య యుద్ధం చెలరేగే ప్రమాదముందని దానికి కాశ్మీర్‌ సమస్యనే కీలక కారణమవుతుంద'ని అన్నట్లుగా ఆ దేశ దినపత్రిక 'డాన్‌' పేర్కొనడంతో వివాదం రాజుకుంది. అయితే కొన్ని గంటల అనంతరమే పాకిస్థాన్‌ ప్రధానమంత్రి కార్యాలయం నవాజ్‌ షరీఫ్‌ అలాంటి ప్రకటన చేయలేదని, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో షరీఫ్‌ ప్రకటనలో యుద్ధం అన్న మాటే లేదని, 'డాన్‌' పత్రికలో వచ్చిన వ్యాసం దురుద్దేశంతో కూడుకున్నదని, వాస్తవ దూరమని ప్రకటించింది.

 

తమ దేశ పత్రికలో వచ్చిన నిరాధారమైన వార్త భారత్‌కు కంటగింపుగా ఉండొచ్చని అంగీకరిస్తూనే భారత భూభాగంలో ఉన్న కాశ్మీర్‌కు విముక్తి లభించడాన్ని తన హయంలోనే చూడాలని మాత్రమే నవాజ్‌ షరీఫ్‌ ఆకాంక్షించినట్లు పాక్‌ ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా వాస్తవాధీన రేఖ వెంబడి పాక్‌ కవ్వింపు చర్యలకు ఇటీవల కాలంలో దిగుతున్న నేపథ్యంలో పాక్‌ ప్రధాని చెప్పినట్టుగా కాశ్మీరే యుద్ధానికి కారణమవుతుందనే వార్త వివాదాస్పదంగా మారింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles