Mars mission in few more hours

Mars Mission in Few more hours, India to launch Mars Mission in Few more hours

Mars Mission in Few more hours, India to launch Mars Mission in Few more hours

మరికొన్ని గంటల్లో మన కలల ప్రయోగం..

Posted: 11/05/2013 09:45 AM IST
Mars mission in few more hours

ఇస్రో శాస్త్రవేత్తల కలల ప్రయోగం మరికొన్ని గంటల్లో కార్యరూపం దాల్చబోతోంది. అన్ని పరీక్షలూ పూర్తయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషాలకు మంగళ్యాన్‌ అంగారక గ్రహంపైకి దూసుకెళ్లనుంది. అంగారక గ్రహం గురించి అన్వేషణ కోసం ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన 'మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఉప్రగహాన్ని మోసుకొని భూ కక్ష్యలో ప్రవేశ పెట్టేందుకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్ ఎల్ వీ-సి 25) శ్రీహరి కోటలోని షార్ ప్రయోగవేదికపై సిద్ధంగా ఉంది. . మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి శాస్త్రవేత్తలు కౌంట్ డౌన్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. పీఎస్ ఎల్ వీలో ఘన, ద్రవ ఇంధనాన్ని నింపారు. ప్రయోగానికి ముందుగా ఐదుసార్లు ఆకాశంలోకి బెలూన్ లను వదిలి గాలివాటాన్ని పరిశీలిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సూపర్ కంప్యూటర్ ఆదీనంలోకి రాకెట్ వెళ్తుంది. ప్రయోగం చివరి పది నిమిషాల్లో అన్నీ వ్యవస్థలను పరీక్షించి రాకెట్ ను నింగిలోకి పంపుతారు.

 

సెప్టెంబర్‌ 24, 2014 వరకు కక్ష్యలోనే మామ్‌

మంగళ్యాన్‌ టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది. 1.35 టన్నుల బరువు గల ఈ ఉపగ్రహం రిఫ్రిజిరేటర్‌ సైజులో ఉంది. బంగారు కవర్‌తో కప్పి ఉంచిన మంగళ్యాన్‌ను 45 మీటర్ల పొడవైన పిఎస్‌ఎల్‌వి-సి25 రాకెట్‌ అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. భూమిపై నుంచి దూసుకెళ్లిన 40 నిమిషాల్లో భూ కక్ష్యలోకి చేరుతుంది. దాదాపు నెల రోజుల పాటు భూ కక్ష్యలో తిరుగుతూ గురుత్వాకర్షణ శక్తిని అధిగమించేందుకు అవసరమైన శక్తిని కూడగట్టుకుంటుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 24న రెడ్‌ ప్లానెట్‌ కక్ష్యలోకి చేరుకుంటుంది.

 

మార్స్‌పై మానవ మనుగడపై పరిశోధనలు

మంగళ్యాన్‌ అంగారక గ్రహంపై చిత్రాలను తీస్తుంది. అక్కడ నివసించేందుకు గల అవకాశాలనూ పరిశోధిస్తుంది. ఇస్రో చేపట్టిన ఈ కలల ప్రాజెక్టు భారీ రిస్క్‌తో కూడినదని ఆ సంస్థ ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌ అన్నారు. మంగళ్యాన్‌ ప్రయోగాన్ని సక్సెస్‌ చేయడం ద్వారా అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ సత్తాను ప్రపంచానికి చాటాలన్నదే ఇస్రో ప్రధాన ఉద్దేశ్యమంటున్నారు. ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో మార్స్‌పై మరిన్ని ప్రయోగాలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

 

 

ఇటలీకి చెందిన వ్యోమగామి గెలీలియో నాలుగు శతాబ్దాల క్రితం టెలిస్కోప్‌ను కనుక్కున్నారు. ఆ టెలిస్కోప్‌ ఆధారంగానే ఇతర గ్రహాలతో పాటు అంగారకుడ్ని కూడా గుర్తించారు. దానిపై పరిశోధనలూ అప్పటి నుంచే ప్రారంభమయ్యాయి. రెడ్‌ ప్లానెట్‌పై పరిశోధనల్లో అమెరికా అందరికంటే ముందుంది. మార్స్‌పైకి ఉపగ్రహాలను, పరిశోధక నౌకలను, రోవర్లను పంపించింది. రష్యా, జపాన్‌ కూడా మార్స్‌పై ప్రయోగాలు చేసినా.. సక్సెస్‌ రేటు అంతగా లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles