Minister chiranjeevi press meet on ap bifurcation

minister chiranjeevi press meet on ap bifurcation, Minister for Tourism Chiranjeevi, minister chiranjeevi, congress party, telangana issue, seemandhra movement, congress ministers, cm kiran kumar reddy,

minister chiranjeevi press meet on ap bifurcation

డిమాండ్లు ఏం లేవు : చిరంజీవి

Posted: 10/26/2013 12:35 PM IST
Minister chiranjeevi press meet on ap bifurcation

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె. చిరంజీవి ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడటం జరిగింది. రాష్ట్ర విభజన పై ఈరోజు కొంచెం డిఫరెంట్ గా మాట్లాడినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామని , రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు చివరి వరకు పోరాడతామన్నారు. తెలంగాణ పై బిల్లు, తీర్మానం రెండూ అసెంబ్లీకి పంపాలని చిరంజీవి అన్నారు.

 

అయితే విభజన ప్రక్రియలో కేంద్రం రాజ్యాంగ విరుద్దంగా వెళ్తోందన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలను మంత్రి చిరంజీవి మద్దతు తెలిపినట్లు సమాచారం. అయితే సీమాంద్రుల ఆకాంక్షలను పట్టించుకోకుండా విభజనపై ముందుకెళ్లడాన్ని ఎవరూ హర్షించరన్నారు.

 

రాష్ట్ర విభజన ప్రకటన కాంగ్రెస్ హైకమాండ్ చేసిన కొన్ని రోజుల తరువాత.. కేంద్ర మంత్రి చిరంజీవి.. సోనియా గాంధీ తో భేటీ అయ్యారు. ఈ సమయంలో చిరంజీవి హైదరబాద్ పై తన మనసులోని డిమాండ్ ను సోనియా చెప్పటం జరిగింది. హైదరాబాద్ ను యూటీ చేస్తే అందరికి బాగుటుందని చిరంజీవి సోనియా గాంధీతో చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. చిరంజీవి కూడా పబ్లిక్ మీడియాతో.. హైదరాబాద్ యూటీ చేయాలనే విషయాన్ని చెప్పటంతో.. ఒక్కసారిగా... అటు సీమాంద్రలోను, ఇటు తెలంగాణలో లో చిరంజీవి చేసిన డిమాండ్ పై నిరసన జ్వాలాలు రేగాయి. అప్పటి నుండి చిరంజీవి నోట .. విభజన పై ఎలాంటి ప్రకటన చేయలేదు కాద.. కామెంట్ కూడా చేయటంలో చిరంజీవి వెనకబడిపోయారు. మళ్లీ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పటం ఆశ్చర్యంగా ఉందని తెలంగాణ వ్యతిరేక వాదులు అంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles