Kcr sees no need to merge with congress

Telangana Rashtra Samithi, TRS, president, K Chandrasekhar Rao, KCR, chief minister, Telangana state, Congress, Telangana formation,telangana rastra samithi,kiran kumar reddy

K Chandrasekhara Rao on Friday spelt out his rather tough terms of surrender to the Congress. For even to consider merging his party with the Congress, he made it clear the Centre must pass the Telangana Bill in both Houses of Parliament and leave Hyderabad untouched.

బిల్లు పెట్టాకే పార్టీ విలీనం

Posted: 10/26/2013 08:55 AM IST
Kcr sees no need to merge with congress

గత కొంత కాలంగా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కాబోదని, కేవలం కాంగ్రెస్ తో పొత్తు మాత్రమే పెట్టుకుంటుందని , ఒకవేళ తెలంగాణ ఇచ్చినా వచ్చే ఎన్నికల్లో గతంలోలాగే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తుందని ఆ పార్టీ నాయకుల నుండి వార్తలు వచ్చిన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు ఈ విషయం పై టీఆర్ఎస్ భవన్ లో జరిగిన కార్యవర్గ సమావేశంలో మరోసారి స్పష్టంగా తెలియజేశారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టిన తర్వాతే... విలీనంపై చర్చిస్తామని, అప్పటి వరకు విలీనం మాట ఎత్తవద్దని ఆయన అన్నారు.

టీ బిల్లు ఆమోదం పొందే వరకు నేతలు విలీనం పై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. తెలంగాణ ఏర్పాటులో తేడా వస్తే యుద్ధమే ఉంటుందని, హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని చేయటానికి తాము ఒప్పుకోమని తేల్చిచెప్పారు. లంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులకు కేసీఆర్ పలు సూచనలు చేశారు.  తెలంగాణా రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా టిఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని, పార్లమెంట్‌లో బిల్లు పెట్టే వరకు కేడర్‌ను సమాయత్తం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.

నవంబర్‌ 10 నుంచి మండల స్థాయిలో శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాలని నేతలను ఆదేశించారు. ఆ తర్వాత కరీంగనగర్‌లో భారీ బహిరంగ నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. టీ బిల్లు ఆమోదం పొందే వరకు నేతలు ఎలాంటి అపోహలు లేకుండా ప్రజాక్షేత్రంలో పనిచేయాలని సూచించారు. కేసీఆర్ వ్యాఖ్యలతో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ విలీనం విషయంలో ఉన్న అపోహలు తొలగిపోయాయని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles