Congress eyes sachin tendulkar

Congress eyes Sachin Tendulkar, Assembly elections 2013,BJP,Jyotiradiya Scindia,Madhya Pradesh poll,Sachin tendulkar,Shivraj Singh Chouhan

After cricket, politics seems to be the next stop for cricketing legend Sachin Tendulkar. After master blaster of Indian cricket announced that he will quit playing after his 200th Test match, he has been shortlisted by Congress as star campaigner for Madhya Pradesh Assembly polls

మాస్టర్ పై కాంగ్రెస్ కన్ను

Posted: 10/22/2013 07:14 PM IST
Congress eyes sachin tendulkar

ఎన్నికలు సమీపిస్తున్నాయంటే చాలు రాజకీయ పార్టీలు సెలబ్రెటీలను ఎన్నికల ప్రచార అస్త్రాలుగా వాడుకోవాలని చూస్తాయి. ఇప్పుడు అదే పనిలో పడింది కాంగ్రెస్. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆ క్రీడకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఆయనను రాజకీయ మైదానంలో దించడంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి సారథ్యం వహిస్తున్న జ్యోతిరాదిత్య సింధియా ‘ప్రజాకర్షక ప్రచారకర్త’ గా సచిన్ ని  ఎంపిక చేసిందని సమాచారం. దీనిపై సింధియా ఆయనతో చర్చించి ఒప్పిస్తారని పార్టీవర్గాలు తెలిపాయి.

ప్రముఖ పౌరుల కోటాలో ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టినందున ఇందుకు కాదనబోరని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో ముఠా కుమ్ములాటలతో కునారిల్లుతున్న పార్టీని ఏకతాటిపై నడపడంలో సచిన్ ప్రజాకర్షక శక్తి ఇతోధికంగా తోడ్పడుతుందని అధిష్ఠానం విశ్వసిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. మరి సచిన్ పూర్తి స్థాయి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తాడా ? ఒకవేళ కాంగ్రెస్ మాటను కాదనకుండా ప్రచారం చేస్తాడా ? అన్నది ముందు ముందు చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles