Ys jagan samadhi in osmania university

YS jagan Samadhi in osmania university, OU students, YS jagan ghat, YS jagan ghat in osmania

YS jagan Samadhi in osmania university, OU students, YS jagan ghat, YS jagan ghat in osmania

ఉస్మానియాలో జగన్ కి సమాధి కట్టారు

Posted: 10/23/2013 09:07 AM IST
Ys jagan samadhi in osmania university

మన సంస్కృతి రోజు రోజుకు దిగజారిపోతుందనడానికి ఈ సంఘటనలే నిదర్శనం. ఎన్నో సాంప్రదాయాలు కలిగిన మన తెలుగు జాతిని రాజకీయ నాయకులు స్వార్థం కోసం, ఓట్ల కోసం ప్రజల్ని రెచ్చగొడుతూ సంస్కృతిని దిగజారుస్తున్నారు. మన సంస్కృతి, సాంప్రదాయం ప్రకారం బతికున్న వారికి సమాధి కట్టడం పద్దతి కాదు. కానీ మన రాష్ట్ర విభజన పై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి సోనియాగాంధీ కారణమంటూ సమైక్యవాదులు తిరుపతిలో ఆమె సమాధి కట్టి, కర్మకాండలు నిర్వహించారు. ఈ వ్యవహారం పై కాంగ్రెస్ వారు రచ్చ రచ్చ చేశారు.

తమ అధినేత్రికి సమాధి కట్టిన వారి పై కేసులు పెట్టించారు. ఈ వ్యవహారం చల్లారక ముందే తెలంగాణ వాదులు కూడా అలాంటి పనే చేశారు. ఈ సారి సోనియాగాంధీ పై కాదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కి ఉస్మానియా యూనివర్సిటీలో సమాధి కట్టారు. సోనియా తెలంగాణ ఇవ్వడానికి కారణం అయితే, జగన్ తెలంగాణ ఏర్పడకుండా సమైక్యవాదంతో అడ్డుపడుతున్నాడంటూ తెలంగాణ మాదిగ విద్యార్థి సంఘం నాయకులు ఈ సమాధి కట్టి తమ నిరసనను తెలిపారు.

లక్షకోట్లు సంపాదించి జైలుకు వెళ్ళి తన డబ్బు బలంతో బయటకు వచ్చి దర్జాగా తిరుగుతున్న ఆయన సమైక్యవాదం పేరుతో తెలంగాణను అడ్డుకోవడానికి సభలు నిర్వహిస్తున్నాడని, హైదరాబాద్ లో నిర్వహించే సభను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. సోనియా సమాధి కట్టినందుకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వారి పై కేసులు పెట్టారు. మరి సమైక్యవాదానికి మద్దతు ఇస్తున్న జగన్ సమాధి కట్టినందుకు కూడా కేసులు పురమాయిస్తారా లేదా చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles