Cm kiran kumar reddy final discussion ap bifurcation

cm kiran kumar reddy final discussion ap bifurcation, Andhra Pradesh united, Chief Minister N Kiran Kumar Reddy, Kiran Kumar Reddy, Discussion On CM Kiran Comments, seemandhra ministers,

cm kiran kumar reddy final discussion ap bifurcation

చిత్తూరు సారు చెప్పిన చివరి మాటలు?

Posted: 10/01/2013 11:08 AM IST
Cm kiran kumar reddy final discussion ap bifurcation

చిత్తూరు సారు గారు చివరి మాటలు చెప్పాడు. రాష్ట్ర విభజన పై చిత్తూరు సారు మాట్లాడటం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంద్ర కోసం పట్టువీడని విక్రమార్కుడు మాదిరిగా కాంగ్రెస్ హైకమాండ్ తో పోరాటం చేస్తున్నారు. ఢిల్లీ పెద్దలను సైతం ఎదిరించే స్థాయికి చిత్తూరు సార్ వెళ్లిపోయారు. కొమ్ములు తిరిగిన దిగ్విజయ్ సింగ్ లాంటి వారికే .. చిత్తూరు సారు అంటే ఏమిటో చూపించారు. చిత్తూరు సారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాష్ట్ర విభజన జరగదని గట్టిగా చెప్పారు. రాష్ట్ర విభజన అంశం పై సీమాంద్ర నేతలు అక్టోబర్ మూడోతేదీన నిర్వహించతలపెట్టిన సమావేశం గురించి ప్రస్తావనకు వచ్చింది. అయితే ముఖ్యమంత్రిగా తాను ఉండగా విభజన జరగదని కిరణ్ వారికి భరోసా ఇచ్చారు. అధిష్ఠానం నుంచి ఏదో ఒక స్పందన వచ్చిన తర్వాత సీమాంద్ర నేతల సమావేశం నిర్వహించకుంటే బాగుంటుందని, అలాంటిది లేనప్పుడు కొత్తగా చర్చించేదేమి ఉంటుందని చిత్తూరు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే సీమాంద్ర మంత్రులకు చిత్తూరు సారు భరోసా ఇవ్వటంతో.. కొంచెం ఊపిరి పిల్చుకున్నారు. అయితే ఈ సమావేశంలో బొత్స లేకపోవటం అందర్ని ఆశ్చర్యపరిచింది. అయితే చిత్తూరు సార్ కు అక్టోబరే ఆఖరి గడియాలు అని రాజకీయ నాయకులు అంటున్నారు. అందుకే కాంగ్రెస్ నాయకులే చిత్తూరు సార్ పలికిన మాటలను చివరి మాటలుగా చెప్పుకుంటూ.. సమావేశం నుండి బయటకు వెళ్లిపోయారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles