Bjp kishan reddy disappointed

bjp kishan reddy disappointed, bjp highcommand serious, telangana leader appointment cancel, seemandhra congress leaders granted, kishnareddy resign romours

bjp kishan reddy disappointed, bjp highcommand serious, telangana leader appointment cancel, seemandhra congress leaders granted, kishnareddy resign romours

కిషన్ రెడ్డి బాగా ఫీలయ్యాడు

Posted: 10/01/2013 08:23 AM IST
Bjp kishan reddy disappointed

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కోపం వచ్చింది.... ఆయనకు సీమాంధ్ర నేతల నుండి ఎదురైన అనుభవం మనస్థాపాన్ని కలిగిందచింది. ఓ దశలో ఆయన తన పదవికి రాజీనామా చేయాలని కూడ అనుకున్నారు . రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో భాజాపా రాష్ట్ర కిషన్ రెడ్డి అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశం జరిగింది. దీనికి పార్టీ నాయకులు ఇంద్రసేనారెడ్డి, యెండెల లక్ష్మినారాయణ, వి. రామారావు, శేషగిరిరావు, శాంతారెడ్డి, సురేష్ రెడ్డి, సోము వీర్రాజు , రవీంద్రరాజు పాల్గొన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమం, పార్టీ తీరు పై వస్తున్న విమర్శలు, పార్టీ కార్యాలయాల పై జరుగుతున్న దాడులను వివరించడానికి జాతీయనేతలతో చర్చించడానికి ఢిల్లీ వెళ్లడానికి ప్లాన్ చేశారు.

దీనికి సంబంధించిన అంశం పై, మొన్న సకల జనభేరిలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పై సీమాంధ్ర ప్రాంత నాయకులు కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.. ఆంధ్రోళ్లంతా తెలంగాణ ద్రోహులే' అన్న కేసీఆర్ వ్యాఖ్యలపై సీమాంధ్ర నేతలు మండిపడ్డారు. "తెలంగాణకు అనుకూలంగా బీజేపీ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. సీమాంధ్రలో పార్టీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నా, పార్టీ సమావేశాలను అడ్డుకుంటున్నా.. భౌతిక దాడులకు పాల్పడుతున్నా.. పార్టీ నిర్ణయాన్ని ఎదిరించలేదు. ఆంధ్రోళ్లంతా ద్రోహులే అని విమర్శిస్తుంటే పార్టీ నేతలు ఎందుకు ఖండించలేదని నిలదీశారు.

అలాంటి నేతతో భవిష్యత్తులో వేదికను పంచుకోవద్దని కరాఖండిగా తేల్చి చెప్పారు. సీమాంధ్రులు తమ పై వ్యక్తం చేసిన అసంత్రుప్తికి ఓ దశలో తీవ్ర ఆవేదనకు గురయ్యి , మీరు పరిస్థితులను అర్థం చేసుకోవడం లేదంటూ పార్టీని మీరే నడుపుకోండి అంటూ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. మొత్తానికి కమలం కోర్ కమిటీ భేటి వేడి, వేడిగా జరిగినట్లు చెబుతున్నారు. .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles