Ap ngos leader ashok babu announces action plan

AP NGOs leader Ashok Babu announces action plan, Telangana leaders slams AP NGOs leader Ashok Babu, APNGOs president Ashok, Ashock Babu press meet

AP NGOs leader Ashok Babu announces action plan, Telangana leaders slams AP NGOs leader Ashok Babu, Ashock Babu press meet

స్వార్థపరులు వేర్పాటు- సమ్మె విరమించం

Posted: 09/25/2013 06:16 PM IST
Ap ngos leader ashok babu announces action plan

ఏపీ ఎన్జీవో నాయకుడు అశోక్ పై తెలంగాణ నాయకులు మాటల తూటాలు పేల్చారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అయితే నాలుకలు కొస్తాం అంటూ.. మీడియా ముందు బహిరంగంగా అనటం జరిగింది. అయితే ఈ కామెంట్స్ పై అశోక్ బాబు స్పందించారు. మా నాలుకలు తెగ్గోసినా.. కాళ్లు, చేతులు విరగ్గొట్టినా.. తెగ నరికినా సరే తాము కొనసాగిస్తున్న సమ్మె విరమించేది లేదని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. తెలంగాణ ప్రజలపై విద్వేషంతో తాము ఉద్యమం చేయటం లేదని ఆయన స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో తమ ప్రసంగాలను వక్రీకరించటం భావ్యం కాదని అశోక్ బాబు అన్నారు. తాను ఎవర్నీ ఎప్పుడు కించపరిచేలా మాట్లాడలేదని...తమ ప్రసంగాల్లో తప్పులు దొర్లితే సరిదిద్దుకోవడానికి, చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. కొంతమంది స్వార్థపరుల వేర్పాటు వాదం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చిందని అశోక్ బాబు అన్నారు. కేంద్రంలో ఎంపీలు రాజీనామాలు చేయటం ఎంత అవసరమో.... రాష్ట్రంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా ఉండటం అంతే అవసరం అన్నారు. ఒకవేళ అసెంబ్లీకి తెలంగాణపై తీర్మానం వస్తే దాన్ని ఓడించాల్సిన బాధ్యత సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రతి ఎమ్మెల్యేపై ఉందని అశోక్ బాబు అన్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles