Moily does not rule out poll pact between cong jagan party

YSR Congress,YS Jaganmohan Reddy,M Veerappa Moily,Congress, YSR Congress, Andhra Pradesh

Veerappa Moily today did not rule out possibility of an electoral alliance between his party and YSR Congress of YS Jaganmohan Reddy.

ఏమో... జగన్ పొత్తు ఉండొచ్చు

Posted: 09/26/2013 08:36 AM IST
Moily does not rule out poll pact between cong jagan party

కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి వేరే కుంపటి పెట్టుకున్న వైయస్ జగన్ కాంగ్రెస్ అధిష్టానాన్ని దుమ్మెత్తి పోసిన సంగతి తెలిసిందే. దీంతో అతన్ని అక్రమాస్తుల కేసు కింద దాదాపు 16 నెలల పాటు జైల్లో ఉంచారు. ఇటీవలే జగన్ బెయిల్ పై విడుదల అయ్యారు. వేలకోట్లు అక్రమంగా సంపాదించాడంటూ సీబీఐ జేడీ లక్ష్మినారాయణ తేల్చారు. దాని పై అనేక ఛార్జిషీట్లు ధాఖలు చేశారు. జగన్ ని ఎ1 నింధితుడిగా చేర్చారు. దీంతో జగన్ దాదాపు రెండు మూడు సంవత్సరాల వరకు బైయటకు రాడని అంతా బావించారు. కానీ ఉన్నట్లుండి సీబీఐ తన దర్యాప్తు ముగిసిందని, క్విడ్ అండ్ ప్రో 8 కంపెనీలలో జరగలేదని తేల్చేంది. ఆ మరునాడే జగన్ బెయిల్ కి అప్లై చేశారు. సీబీఐ కోర్టు జగన్ కి బెయిల్ మంజూరు చేయడం, ఆ తరువాత విడుదల అవ్వడం... ఇదంతా చూస్తుంటే రాజమౌళి సినిమా డైరెక్షన్ లాగా పక్కా స్ర్కిప్టు ప్రకారం జరిగినట్లు అనిపిస్తుంది కదూ. అవును అధిష్టానానికి చెందిన పెద్ద, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ మాటలు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. బుధవారం బెంగళూరులో ఓ సమావేశంలో విలేఖర్లతో మాట్లాడుతున్నప్పుడు జగన్ పార్టీతో పొత్తు గురించి ప్రశ్నించగా... ‘భవిష్యత్తులో జగన్ పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు. కానీ, దాని గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేం. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, అంటూ జగన్‌తో దోస్తీకి తలుపులు తెరిచి ఉంచారు. జగన్ బెయిల్ కి సంబంధం లేదంటూనే ఆయనతో పొత్తు సై అనడం వెనక అధిష్టానం హస్తం ఎంత ఉందో స్పష్టంగా తెలుస్తోందని ప్రతిపక్షాలు ఉంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles