Court sentences nirbhaya on friday

Court sentences on Nirbhaya on Friday, Gang rape in Delhi, Delhi gang rape four accused, Delhi gang rape Ram Singh, Delhi gang rape convicted

Court sentences on Nirbhaya on Friday

నిర్భయ కేసులో శుక్రవారం నాడు శిక్షల ప్రకటన

Posted: 09/11/2013 03:08 PM IST
Court sentences nirbhaya on friday

ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచారంలో నిందితులు నలుగురి మీదా విచారణ ఈ రోజు ముగిసింది.  బాధితురాలి మరణ వాంగ్మూలం, ప్రత్యక్షసాక్షి, డిఎన్ ఏ నిర్ధారణలతో కూడిన సాక్ష్యాధారాలనుబట్టి నేరారోపణ రుజువై ఆ నలుగురినీ నిందితులుగా పేర్కొన్న కోర్టు విచారణలో వాద ప్రతివాదుల వాదనలు కూడా ఈ రోజు ముగియటంతో ఇక వాళ్ళమీద వేయవలసిన శిక్షను నిర్ణయించటానికి కోర్టు శుక్రవారం వరకు వాయిదా వేసింది.  శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు నిందితులు నలుగురి కోర్టు విధించిన శిక్షలను ప్రకటించటం జరుగుతుంది.

ఢిల్లీలో కదులుతున్న బస్సులో వైద్య విద్యార్థిని మీద జరిగిన సామూహిక అత్యాచారంలో భాగస్వాములైన ఆరుగురిలో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైలులో ఉరిపోసుకుని మరణించగా, ఒక నిందితుడు బాల నేరస్తుడిగా ఆ శాఖ అదుపులో ఉన్నాడు.  ఇక మిగిలిన నలుగురు అక్షయ్ ఠాకుర్, వినయ్ శర్మ, ముఖేష్ సింగ్, పవన్ గుప్తాల మీద జరిగిన విచారణలో బస్సులో బాధితురాలు, ఆమె స్నేహితుడిని ఎక్కించుకుని దుర్బుద్ధితోనే మరెక్కడా ఆపకుండా ఎవరినీ ఎక్కించుకోకుండా ఒకరి తర్వాత మరొకరిగా సామూహికంగా అత్యాచారం చేసిన నేరం మీద, ప్రత్యక్ష సాక్షియైన ఆమె స్నేహితుడి మీద చేసిన హత్యా ప్రయత్నం మీద వివిధ కేసులలో నేరస్తులుగా కోర్టు పరిగణిస్తున్నట్లుగా సెషన్స్ జడ్జ్ యోగేష్ ఖన్నా ప్రకటించారు.

నిందితుల తరఫు లాయర్ ఈ రోజు వారికి మరణ శిక్ష పడకుండా యావజ్జీవ శిక్ష కోసం కోర్టుని అర్థించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles