Pm promises to put telangana process on fast track

Telangana, Congress , Telangana Rashtra Samithi, Sushil Kumar Shinde, Rajya Sabha, State bifurcation, AK Atony, AK Antony Committee, Telangana, Seemandhra Leaders

Prime Minister Manmohan Singh on Tuesday assured a delegation of Telangana Congress MPs that his government would expedite the process of Andhra Pradesh.

ముందుకు వెళ్ళకండి-తగ్గేదు లేదు

Posted: 09/04/2013 08:23 AM IST
Pm promises to put telangana process on fast track

ఒక ప్రక్క సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు, ముఖ్యమంత్రి కిరణ్ తెలంగాణ పై పరిష్కారం దొరికే వరకు ఆ ప్రక్రియను ముందుకు సాగనీయకండని ఆంటోని కమిటీకి మొరపెట్టుకుంటున్నా, మరో వైపు కాంగ్రెస్ అధిష్టానం, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మాత్రం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ప్రదానిని కలిసిన టి. కాంగ్రెస్ ఎంపీలు సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రక్రియ ఆగిపోతుందంటూ ప్రజలకు అవాస్తమైన హామీలు ఇస్తున్నారని, చంద్రబాబు సోనియాను తీవ్రంగా విమర్శిస్తున్నారని కాబట్టి ప్రక్రియ ఎంత త్వరగా మొదలు పెడితే అంత మంచిదని సూచించారు. దీనికి   ప్రధాన మంత్రి స్పందిస్తూ 'ఇట్ విల్ గో యాజ్ పర్ ది ప్రాసెస్ ’ (ఇది జరగాల్సిన క్రమంలో ముందుకు జరుగుతుంది) అని హామీ ఇచ్చినట్లు తెలంగాణ ప్రాంత ఎంపీలు తెలిపారు. ఇక ఆంటీనికి కలిసిన ముఖ్యమంత్రి, సీమాంధ్ర నాయకులు మాత్రం అన్ని సమస్యలకు పరిష్కారం దొరికే వరకు ముందుకు వెళ్లవద్దని సూచించినట్లు సమాచారం. .కేంద్ర హోం మంత్రి షిండే తెలంగాణ ప్రక్రియపై నోట్ తయారవుతోందని ప్రకటించిన వెంటనే వీరు ఆంటోని కమిటీని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. అయినా కేంద్రం మాత్రం వెనక్కి తగ్గలేదు. సీమాంధ్రుల గోడు వినిపించుకునే వారే ఢిల్లీలో కరువయ్యారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles