Congress party rethinking

congress-party-rethinking, Kiran Kumar Reddy, Anotony committee, Digvijay Singh, Sonia Gandhri, CWC decision on State bifurcation

congress-party-rethinking

విభజన విషయంలో మెత్తబడుతున్న సర్కార్

Posted: 09/04/2013 12:12 PM IST
Congress party rethinking

నిన్న ముఖ్యమంత్రి ఆంటోనీ కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు.  విషయం ఒకటే- సిడబ్లుసి చేసిన రాష్ట్ర విభజన ప్రకటన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. 

ఆ తర్వాత ఈ రోజు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో భేటీ అనంతరం దిగ్విజయ్ సింగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రెండుసార్లు అధికారాన్ని కట్టబెట్టిందని, అందువలన ప్రజల మనోభీష్టాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించటం పార్టీ బాధ్యతని దిగ్విజయ్ అన్నారు.  మొత్తానికి సర్కార్ మెత్తబడుతోందని, రాష్ట్ర విభజన విషయంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఎప్పుడు ఆ విషయంలో మాట్లాడినా వెనక్కి తగ్గేది లేదన్న సంకేతాలను గట్టిగా ఇస్తూ వచ్చిన పార్టీ అధినేత్రి ప్రస్తుతం ఆ మాటలను ఎలా వెనక్కి తీసుకోవాలి, ఎలా సవరించుకోవాలన్న విషయంలో తర్జనభర్జన పడుతోందని అర్థమౌతోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles