All party committee proposal

All party committee proposal, Antony Committee, Gurdas Dasgupta, Lagadapati Rajagopal, Modugula Venugopala Reddy, Telugu Desam party

all party committee proposal

మరో కమిటీకి ప్రయత్నాలు

Posted: 08/22/2013 03:46 PM IST
All party committee proposal

రాష్ట్ర విభజన పీటముడి పడుతున్న నేపథ్యంలో అఖిలపక్ష కమిటీని వెయ్యటానికి పార్లమెంటు వ్యవహారాల మంత్రి కమలనాథ్ ప్రతిపాదన చేసారు. 

కమలనాథ్ చేసిన ఈ ప్రతిపాదనను గురుదాస్ దాస్ గుప్తా, లగడపాటి రాజగోపాల్ తెలుగు దేశం పార్టీ నేతలతో సంప్రదించారు.  ఈ విషయం మీద స్పందిస్తూ, తెలంగాణా బిల్లుకు, తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర అవతరణకు తాము వ్యతిరేకం కాదని దాన్ని అడ్డుకోవటం తమ ఉద్దేశ్యం కాదని, కానీ ఆందోళనంతా సీమాంధ్ర ప్రజల ప్రయోజనాల విషయంలోనేనని చెప్పిన మోదుగుల వేణుగోపాల రెడ్డి, ఈ ప్రతిపాదనను పార్టీలో చర్చించి సరైన నిర్ణయాన్ని తీసుకుంటామని అన్నారు. 

ఈ విషయాన్ని మోదుగుల వేణుగోపాల రెడ్డి మీడియాలో ప్రకటన చేసారు.  ప్రస్తుతం రాష్ట్ర విభజన మీద అభ్యంతరాలను సమీకరిస్తున్న ఆంటోనీ కమిటీ కాంగ్రెస్ పార్టీ కి చెందినదని, ఆ కమిటీ లోకి  తాము వెళ్ళి చెప్పుకోవలసిన అవసరం లేదని తెలుగు దేశం పార్టీ అభ్యంతరాలు వ్యక్తపరచింది. 

ఇప్పడు అఖిలపక్ష సమావేశం వెయ్యటం మిగిలిన పార్టీలు కూడా రాష్ట్ర విభజన మీద తమ వాదనలను వివరించటానికి ఆవకాశమివ్వటానికా లేక ఆంటోనీ కమిటీలా మరో కమిటీ వేసి విషయాన్ని మరింత సాగదీయటానికా అని కూడా రాజకీయ వర్గాలు ప్రశ్నించుకుంటున్నాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles