Chiranjeevi and puri jagannath

chiranjeevi and puri jagannath, Chiranjeevi 150 Movie, director puri jagannath, mega star chiranjeevi, Megastar Chiranjeevi, minister chiranjeevi, chiranjeevi birthday,

chiranjeevi and puri jagannath

దర్శకుడి పూరికి బాకీ పడిన చిరంజీవి

Posted: 08/22/2013 09:11 PM IST
Chiranjeevi and puri jagannath

అభిమానులకే కాకుండా సహచర నటులకు, దర్శకులకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఓ స్పూర్తి, నిలివెత్తు అభిమానం. చిరంజీవితో ఓ సీన్ లోనైనా కనిపించాలని, ఆయనతో ఓ సినిమా చేయాలని కోరుకున్న నటులు దర్శకులు ఎందరో ఉన్నారు. ఇప్పటికి ఓకే అంటే చిరంజీవితో సినిమా చేయడానికి ఎంతో మంది క్యూలో ఎదురు చూస్తున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించక ముందు వరకు చిరంజీవి 149 సినిమాల్లో నటించారు. 150 చిత్రంలో నటించడానికి సిద్ధమంటే తాను దర్శకత్వం వహిస్తానని రాంగోపాల్ వర్మ, పూరి జగన్నాధ్, కృష్ణ వంశీలాంటి క్రియేటివ్ డైరెక్టర్లు పలు ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఆగస్టు 22న చిరంజీవి జన్మదినోత్సవం. చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దర్శకుడు పూరి జగన్నాధ్ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. 'మీ సినిమాలు చూస్తూ పెరిగాం. కాని మీరు మాకు ఒక సినిమా బాకీ పడ్డారు. అది ఎప్పుడు?' అంటూ పూరి ట్వీట్ చేశారు. చిరంజీవి 2009 సంవత్సరంలో చివరిసారిగా తన కుమారుడు రాం చరణ్ తేజ నటించిన 'మగధీర' చిత్రంలో మెరుపులా అలా వచ్చి ఇలా వెళ్లారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles